మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, నవంబర్ 14 : ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాం కు రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని డీసీసీబీ చైర్మన్ చిట్యాల నిజాంపాషా అన్నా రు. అఖిలభారత సహకార వారోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రధాన కార్యాలయ ఆవరణలో సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా పండిట్ నె హ్రూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం చైర్మన్ మాట్లాడు తూ సహకార వారోత్సవాలను 20వ తేదీవరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. సహకార వ్యవస్థ సన్నా, చిన్నకారు రైతులకు సేవలందిస్తున్నట్లు తెలిపారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలను పంపిణీ చే యడంతోపాటు పంటరుణాలు అందించి అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. బ్యాంకు ఉద్యోగులు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి రైతులకు సహకారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ ఉపాధ్యక్షుడు కొరమోని వెంకటయ్య, సీఈవో టి.లక్ష్మయ్య, ఎల్డీఎం కల్వ భాస్కర్, బ్యాంకు జీఎం ఎస్.వెంకటేశ్, డీజీఎం జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
నవాబ్‌పేట, నవంబర్ 14 : సహకార సంఘాల బలోపేతానికి ప్రతిఒక్కరూ సహకరించాలని సింగిల్‌విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు కోరారు. మండల కేంద్రంలోని సింగిల్‌విండో కార్యాలయ ఆవరణలో సోమవారం సహకార సంఘం వా రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార సంఘం జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. సహకార సం ఘాలు రైతులకు అన్నివిధాలా తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు. సబ్సిడీపై ఎరువు లు, విత్తనాలు, వ్యవసాయ రుణాలు అందజేస్తున్నట్లు వివరించారు. అలాగే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ మద్దతు ధరకు కొంటున్నట్లు తెలిపారు. కార్యక్రమం లో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మెండె లక్ష్మ య్య, వైస్‌ఎంపీపీ సంతోష్‌రెడ్డి, సర్పంచ్ గోపాల్‌గౌడ్, ముడా డైరెక్టర్ చెన్నయ్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు తాహేర్, ప్రతా ప్, పాశం కృష్ణయ్య, నర్సింహులు ఉన్నారు.
మూసాపేట(అడ్డాకుల), నవంబర్ 14 : సింగిల్‌విండో ఆధ్వర్యంలో రైతులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు చైర్మన్ మద్దూరి జితేందర్‌రెడ్డి అన్నారు. అడ్డాకుల సింగిల్‌విండో కార్యాలయంలో సోమవారం సహకార సంఘం వారోత్సవాలను ఘనంగా ని ర్వహించారు. ఈ సందర్భంగా జెండాను ఆవ్కిరించి మాట్లాడారు. రైతులకు సకాలం లో ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయడంతోపాటు పంటరుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. సింగిల్‌విండో అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీఈవో వెంకటయ్యగౌడ్ ఉన్నారు.
మిడ్జిల్, నవంబర్ 14 : మండలకేంద్రంలో సహకార సంఘం వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఏసీసీఎస్ కార్యాలయంపై సీఈవో బాల్‌రెడ్డి జెండాను ఎగురవేశారు. కార్యక్రమం లో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, బాలయ్య, కరుణాకర్‌రెడ్డి, శ్రీనివాసులు, సురేశ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
బాలానగర్, నవంబర్ 14 : మండలంలోని మోతీఘణపూర్ సింగిల్‌విండో కార్యాలయంలో సోమవారం సహకార సంఘం వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ప్రతాప్‌రెడ్డి, యాదిరెడ్డి పాల్గొన్నారు.