గండీడ్/మహ్మదాబాద్, నవంబర్ 14 : ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాత సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తూ రైతుబాంధవుడిగా నిలిచారని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి గండీడ్ మండలంలోని జిన్నారం, లింగాయిపల్లి, మన్సూర్‌పల్లి, ఆశిరెడ్డిపల్లి, దేశాయిపల్లి, జూలపల్లి, వెంకట్‌రెడ్డిపల్లి, కంచన్‌పల్లి, మొకర్లాబాద్ గ్రామాల్లో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఎలాంటి కష్టం రానివ్వకుండా సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చే స్తున్నారని తెలిపారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ కమ తం శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌చైర్మన్ లక్ష్మీనారాయ ణ, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గోపాల్, గిరిధర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భిక్షపతి, సర్పంచులు బాల్యానాయక్, ఖాజప్ప, వెంకటయ్య, కవిత, గోపా ల్, రాఘవేందర్, కిరణ్‌కుమార్‌రెడ్డి, రక్షిత, శమంతకమణి, అంజిలయ్య, ఎంపీడీవో రూపేందర్‌రెడ్డి, ఏపీఎంలు అనురాధ, బాలకృష్ణ, నాయకులు గోపాల్‌రెడ్డి, రాం చంద్రారెడ్డి, రాంరెడ్డి, కృష్ణ, రమేశ్‌రెడ్డి ఉన్నారు.
నవాబ్‌పేట, నవంబర్ 14 : రైతులకు మద్దతు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని కొ ల్లూరు, లింగంపల్లి, గురుకుంట, చౌడూర్, ఇప్పటూర్, కాకర్లపహాడ్ గ్రామాల్లో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ మెండె లక్ష్మయ్య, ముడా డైరెక్టర్ చెన్నయ్య, రైతుబంధు సమి తి మండల కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ చందర్‌నాయక్, సర్పంచులు సౌజన్య, పాండురంగారెడ్డి, వెంకటయ్య, గౌసియాబేగం, జంగమ్మ, యాదయ్య, సింగిల్‌విండో వైస్‌చైర్మన్ భూ పాల్‌రెడ్డి, డైరెక్టర్లు నాగ అంజయ్య, ఆంజనేయులు, మాజీ ఎంపీపీ శీనయ్య, ప్రతాప్, కృష్ణాగౌడ్, అబ్దుల్లా, పాశం కృష్ణయ్య, రవికిరణ్, సంజీవరెడ్డి పాల్గొన్నారు.
బాలానగర్, నవంబర్ 14 : ధాన్యం వి క్రయించేందుకు రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని జెడ్పీటీసీ కల్యాణీలక్ష్మణ్నాయక్ కోరారు. మండలకేంద్రంతోపాటు పెద్దాయపల్లి, చిన్నరేవల్లి గ్రామాల్లో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కా ర్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఉన్నారు.
కోయిలకొండ, నవంబర్ 14 : ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసి పథకాలను అమలుచేస్తున్నదని ఎంపీపీ శశికళాభీంరెడ్డి అన్నారు. మండలంలోని చం ద్రాసుపల్లి, సూరారం, కొత్లాబాద్, ఇబ్రహీంనగర్, ఆచార్యాపూర్ గ్రామాల్లో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రా రంభించారు. కార్యక్రమంలో నవోదయ సంస్థ చైర్మన్ ఎస్.రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బి.కృష్ణయ్య, సింగిల్‌విండో చైర్మ న్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు టీవీ ఖాజా, ఎంపీటీసీ ఆంజనేయులు, సర్పంచు లు నారాయణరెడ్డి, గోపాల్, కరుణాకర్‌రెడ్డి, రాములు, చరిత, రాము పాల్గొన్నారు.
రాజాపూర్, నవంబర్ 14 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షు డు నర్సింహులు సూచించారు. మండలంలోని ఈద్గాన్‌పల్లిలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కా ర్యక్రమంలో సర్పంచ్ అలివేల, ఏపీఎం వెం కటాచారి, నరేందర్‌రెడ్డి, ఏఈవో ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.