రాజాపూర్, నవంబర్ 12 : ఉమ్మడి రాష్ట్రంలో సరైన రో డ్డు సౌకర్యం లేక గ్రామాలు, తండాల ప్రజలు ఎన్నో అష్టకష్టాలు పడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక గ్రామాల స్వరూపమే మారిపోయింది. చిన్న గ్రామాలను మొదలుకొని తండాలను కలుపుతూ ప్రభుత్వం బీటీ రోడ్డు వేయడంతో ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడింది. రంగారెడ్డిగూడ గ్రామం జాతీయ రహదారి నుంచి మండలంలోని తిర్మలాపూర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని మారుమూల గ్రామాలు, గిరిజన తండాల నుంచి బయటికి వెళ్ల్లాలంటే సరైన రోడ్డు మార్గం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఎవరికైనా అత్యవసర వైద్యం కోసం దవాఖానకు వెళ్ల్లాలంటే సరైన రోడ్డు మార్గం లేక, ఎటువంటి వా హనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. గ తంలో ఉన్న ప్రభుత్వ నాయకులు, అధికారుల ను రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయాలని కోరిన ఏ నాయకుడు పట్టించుకున్న పాపనా పోలేదని ప్రజలు పేర్కొంటున్నారు.
రాష్ట్రం ఏర్పడ్డాక ఎ మ్మెల్యే లక్ష్మారెడ్డికి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరిన వెంటనే బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.4 కో ట్ల నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చే యించడంతో గ్రామాలు, తండాలకు రవాణా సౌ కర్యం మెరుగుపడింది. బీటీ రోడ్డు నిర్మాణ ప నులు పూర్తైనందున ఖానాపూర్, తిర్మలాపూర్, సింగమగూడ, అంజమ్మతండా, సోమ్లాతండా ప్రజలు, రైతులు, వాహనదారులకు ప్రయాణ సౌ కర్యం మరింత చేరువందని ఆయా గ్రామాల ప్రజలు హ ర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామం నుంచి వేరే గ్రామానికి వెళ్ల్లాలంటే రోడ్డు మార్గం సరైన విధంగా ఉండేది కాదు. రోడ్డు సౌక ర్యం లేక తీవ్ర ఇబ్బందులు ప డ్డాం. అత్యవసర సమయం లో వైద్యం కోసం వెళ్తే ఒక వాహనం కూడా ఊరికి రావాలంటే బయపడేవారం. ప్ర భుత్వం రంగారెడ్డిగూడ నుంచి తిర్మలాపూర్కు బీటీ రోడ్డు వేయడంతో ఏండ్ల కల నెరవేరింది.
– ముస్తాఫా, ఖానాపూర్
జాతీయ రహదారి నుంచి తిర్మలాపూర్ వరకు బీటీ రోడ్డు నిర్మించడంతో మండలంతోపాటు, నవాబుపేట మండల ప్రజలు హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు ఎంతో ఉపయోగపడుతున్నది. రైతులు కూరగాయాలు, పంటలను మార్కెట్లకు తరలించేందుకు రవాణా సౌకర్యం సులభతరమైంది. ప్రజలు, రైతుల సం క్షేమం కోసం నూతనంగా బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మం జూరు చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి రుణపడి ఉంటాం.
– మహేశ్వరి, సర్పంచ్ తిర్మలాపూర్