మక్తల్ టౌన్, నవంబర్ 12 : సర్కార్ దవాఖాన పరిసరాలు పరిశుభ్రంగా ఉండడంతోపాటు పచ్చదనంతో ఉండే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని పీహెచ్ సీ దవాఖానలో శనివారం నిర్వహించిన అభివృద్ధి కమిటీ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై రికార్డులను పరిశీలించడంతోపాటు సమస్యలను అడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కార్ దవాఖానలను అభివృద్ధి పర్చి ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వై ద్య సేవలు అందజేస్తున్న ఘనత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ ముందస్తు ఆలోచనలతో రాష్ట్రంలో అన్ని సర్కార్ దవాఖానలను అభివృద్ధి చేసి ఖరీదైన వైద్యం అందిస్తుండడం జరుగుతుందన్నారు. మక్తల్ దవాఖాన ప రిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. దవాఖానలో చి కిత్స పొందుతున్న రోగులకు ఎలాంటి దుర్వాసన రాకుం డా ఎప్పటికప్పుడు పారిశుధ్య ప నులు చేపట్టాలని సంబంధిత ము న్సిపల్ కమిషనర్ మల్లికార్జునస్వామిని ఎమ్మెల్యే ఆదేశించారు. దవాఖాన ఆవరణలోకి పందులు రా కుండా తగిన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉందన్నారు.
దవాఖానకు చికిత్స కోసం వచ్చే రోగులకు వైద్య సి బ్బంది ప్రశాంతమైన వాతావరణంలో వైద్య సేవలు అందించాలన్నారు. ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్నందు వల్ల పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ప్రసవానికి వచ్చే వారిపై వైద్యసిబ్బంది దురుసుగా ప్రవర్తించరాదన్నారు. సమావేశంలో జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రంజిత్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ పావని, మక్తల్ దవాఖాన డాక్టర్లు చక్రధర్‌గౌడ్, పార్వతి, నికిత, రాజ్యలక్ష్మి, జూనియర్ అసిస్టెంట్ యాదగిరి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇష్టంతో కష్టపడి చదివితే దేనినైనా సాధించే సత్తా విద్యా ర్థి దశలోనే విద్యార్థులకు ఉంటుందని ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి అన్నారు. పట్టణానికి చెందిన వాకిటి శృతి నీ ట్లో 3557 ర్యాంక్ సాధించిన సందర్భంగా శనివారం ఎ మ్మెల్యే నివాసంలో ఆయన శృతిని శాలువాతో సన్మానించి మిఠాయి తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో గొప్పదని విద్యార్థులు కష్టపడి చ దివి మంచి డాక్టర్లుగా ఎదిగి రాష్ర్టానికి, పుట్టిన ఊరుకి వన్నె తేవాలనీ సూచించారు. నీట్లో విద్యార్థులు ఉత్తమ ఫలితా లు సాధించడం, శృతికి వనపర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్ రావడం ఆనందకరమైన విషయమన్నారు. కా ర్యక్రమంలో విద్యార్థి తండ్రి శ్రీనివాస్ ఉన్నారు.