జడ్చర్ల, నవంబర్ 12 : రైతు సంక్షేమమే ప్రభు త్వ లక్ష్యమని జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, పీఏసీసీఎస్ చైర్మన్ సుదర్శన్‌గౌడ్ అన్నారు. జడ్చర్ల మం డలంలోని పోలేపల్లి, కోడ్గల్, నసరుల్లాబాద్ గ్రా మాల్లో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. సకాలంలో ఎరువులు, విత్తనాలను పంపిణీ చేయడంతోపాటు వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ సరఫరా, రైతుబంధు తదితర పథకాలతో రైతులకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ముం దుకొచ్చి రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తున్నదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో సర్పంచులు మమతానవీన్రెడ్డి, రవీందర్‌రెడ్డి, ఉపసర్పంచ్ రవి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, నవీన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, జంగయ్య, ఏపీఎం మాల్యానాయక్, సీఈవో యాదగిరి, రాఘవేందర్‌గౌడ్, రామకృష్ణారెడ్డి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.