పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్యంతోపాటు చికిత్సలకు అయ్యే ఖర్చులు పూర్తిగా తగ్గించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఉచితంగా ఖరీదైన రోగ నిర్ధారణ పరీక్షలను నిర్వహించేందుకు టీహబ్ డయాగ్నొస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేసింది. మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల జిల్లాలో నిర్వహిస్తున్నారు. రక్త, మూత్ర పరీక్షలు, ఈసీజీ, ఎక్స్‌రే, ఎంఆర్ఐ, సీటీ స్కాన్, ఆల్ట్రాసౌండ్, ఇతర స్కానింగ్లతోపాటు 58 రకాల టెస్టులను ఉచితంగా చేస్తున్నారు. అవసరమున్న పేషెంట్ల నుంచి సేకరించిన శాంపిళ్లను పరీక్షలకు పంపి కేవలం 12 గంటల్లోనే రిపోర్టులు సిద్ధం చేసి అందజేస్తున్నారు. 16 నెలల్లోనే రికార్డు స్థాయిలో రెండు జిల్లాల్లో 52 లక్షల పరీక్షలు చేశారు. చిల్లిగవ్వ చెల్లించే అవసరం లేకుండా ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా పరీక్షలు చేస్తుండడంతో పేషెంట్లకు వరంగా మారాయి. దీంతో కేంద్రాలకు క్యూ కడుతున్నారు.
మహబూబ్‌నగర్, నవంబర్ 10 (నమస్తే తె లంగాణ ప్రతినిధి) : ప్రభు త్వ దవాఖానల్లో నిరంతర వై ద్య సేవలందుతున్నాయి. ఈ క్ర మంలో మరో ముందడుగేసి ఉచితం గా డయాగ్నొస్టిక్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్ ప్రభుత్వ దవాఖానల్లో టీ హబ్ పేరుతో తెలంగాణ రోగ నిర్ధారణ పరీక్ష కేం ద్రాలను జూన్ 14, 2021లో సర్కార్ ప్రారంభించింది. ఆనాటి నుంచి నేటి వరకు 16 నెలల్లో 52 లక్షల పరీక్షలను నిర్వహించారు. రోగుల నుంచి సు మారు ఐదు లక్షల శాంపిళ్లను సేకరించి రిపోర్టులు ఇచ్చారు. డయాగ్నొస్టిక్ సెంటర్లలో 58 రకాల ఖరీదైన టెస్టులు ఉచితంగా చేస్తున్నారు.
రోగుల నుంచి సేకరించిన శాంపిళ్లను పరీక్షలకు పంపి.. కేవలం 12 గంటల్లోనే రిపోర్టులు ఇస్తున్నారు. దీంతో ప్రైవేట్‌కు వెళ్లి రూ.వేలు ఖర్చు చేసుకునే బాధ తప్పిందని రో గులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని అవసరం ఉన్నా.. లే కున్నా ప్రైవేట్ దవాఖాన డాక్టర్లు ఎన్నో రకాల టె స్టులు రాసేశారు. దీంతో రోగుల జేబులకు చిల్లులు పడేవి. రూ.పది ట్యాబ్లెట్ అవసరమున్న రోగానికి కూడా రూ.వేలల్లో గుంజేవారు. నేడు ప్రభుత్వ డయాగ్నొస్టిక్ సెంటర్లలో ఉచితంగా పరీక్షలు చేస్తుండడంతో దోపిడీకి చెక్ పడింది.
పేదలకు ఉచితంగా డయాగ్నొస్టిక్ సేవలను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా 16 జిల్లాలను ఎంపిక చేసి.. పరీక్షా కేంద్రాలను ప్రారంభించింది. ఇందులో జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్ దవాఖానలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతంలో రక్త, మూత్ర పరీక్షలతోపాటు బీపీ, షుగర్లకు మాత్రమే టెస్టులు చేసేవారు. కొన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఎక్స్‌రేలు తీసేవారు. కానీ నేడు 58 రకాల పరీక్షలు డయాగ్నొస్టిక్ సెంటర్లలో చేస్తున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా రోగికి అవసరమైన పరీక్షలను చేస్తారు.
అప్పటికప్పుడే ఇవ్వాల్సిన రిపోర్టులు ఇచ్చి.. కొన్ని పరీక్షలకు మాత్రం ప్రభుత్వ ల్యాబ్‌లకు పంపించి పూర్తిస్థాయిలో పరీక్షలు చేయించి రోగికి అందజేస్తున్నారు. ఈసీజీ, ఎక్స్‌రే, ఎమ్మారై, సీటీస్కాన్, అల్ట్రాసౌండ్, వివిధ రకాల స్కానింగ్‌లు చేస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 1,69,888 మంది నుంచి టీ హబ్ ద్వారా 3,67,212 శాంపిళ్లను సేకరించారు. 38,36,248 రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి రోగులకు రిపోర్టులు అందజేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 71,121 మంది నుంచి 1,19,287 శాంపిళ్లను తీసి 13,65,312 రోగ నిర్ద్ధారణ పరీక్షలను చేసినట్లు అధికారులు తెలిపారు.
నాకు గుండెనొప్పి వచ్చింది. ప్రైవేట్ దవాఖానకు వెళ్తే రూ.30వేలు ఖర్చవుతుందన్నారు. కొందరి సలహా మేరకు మహబూబ్‌నగర్ ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్ సెంటర్‌కు వెళ్లాను. ఈసీజీ, గుండె సంబంధిత పరీక్షలు ఉచితంగా నిర్వహించి రిపోర్టులు ఇచ్చారు. అందులో ఏమీ తేలలేదు. అయినా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచించారు. ప్రైవేట్ దవాఖానల్లో వేలకు వేలు ఖర్చేయ్యేది. ప్రభుత్వం మా లాంటి పేదలకు ఉచితంగా రోగనిర్ధారణ పరీక్షలు చేస్తుండడంతో ఎంతో మందికి మేలు జరుగుతుంది.
