ఓటర్ల ముసాయిదా జాబితా విడుదలైంది. 2023 స్పెషల్ సమ్మర్ రివిజన్ లిస్టును రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. గతానికి భిన్నంగా సంవత్సరంలో నాలుగుసార్లు జాబితాలో ఓటర్లుగా పేర్ల నమోదుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇటీవల 17 ఏండ్లు దాటిన యువతకూ
ఓటు హక్కు అవకాశం కల్పిస్తూ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ క్రమంలో ఎన్నికల అధికారులు ముసాయిదాను రిలీజ్ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో జాబితా ప్రదర్శించనున్నారు. మార్పులు, చేర్పులకు డిసెంబర్ 8వ తేదీ వరకు గడువు విధించారు. జనవరి 5న చివరి లిస్ట్‌ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 24,00,420 మంది ఓటర్లుగా నమోదయ్యారు.
నాగర్‌కర్నూల్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : 2023 ఎన్నికల ఓటర్ల ముసాయిదా జా బితాను ఎన్నికల అధికారులు విడుదల చేశారు. గతానికి భిన్నంగా ఓటర్ల నమోదులో అధికారు లు కొత్త మార్పులు తీసుకొచ్చారు. దీని ప్రకారం 17 ఏండ్లు దాటిన యువతకూ ఓటు హక్కు న మోదు చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే ఇకపై ఏడాదికి ఒక్కసారికి బదులుగా నాలుగు సార్లు ఓటర్ల నమోదుకు చర్యలు తీసుకోనున్నది. జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1వ తే దీల్లో ఓటు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశా లు కల్పించింది. దీంతో గతంలో మాదిరి వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏండ్లు ఉండాలనే నిబంధన తొలగించారు.
దీని ప్రకారం ఏడాదిలో మూడు నెలలకు ఒకసారి 17 ఏండ్లు నిండే యు వతకు ఓటర్లుగా పేర్లు నమోదు చేయించుకునే వె సులుబాటు లభించింది. దీనివల్ల స్థానికంగా జ రిగే ఎన్నికల్లో వయోజనులు సులువుగా ఓటర్లుగా పేర్లు నమోదు చేయించుకోవచ్చు. ఆగస్టు 1 నుంచి తాజాగా ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం చేపట్టిన గడువు ముగుస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న ఓటర్ల ముసాయిదా జాబితాను అధికారులు విడుదల చేశారు. ఈ జాబితాను పో లింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అందుబాటులో ఉంచా రు. ప్రస్తుతం స్మార్ట్ యుగం నడుస్తుండడంతో ఆ న్‌లైన్, మొబైల్స్‌లోనూ ఓటు కోసం యువత దరఖాస్తులు చేసుకుంటున్నది. ఇలా ఎన్నికల సంఘం స్వీకరించిన వివరాల ప్రకారం నాగర్‌కర్నూ
ల్ జిల్లాలో 6,44,452 మంది ఓటర్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇందులో పురుష ఓటర్లు 3,25,177, మహిళా ఓటర్లు 3,19,268, ఇతరులు 7 మంది ఉన్నారు. పురుషుల తో దాదాపు సమానంగా మ హిళా ఓటర్లు ఉండడం గమనార్హం. వచ్చే ఏడాది డిసెంబర్లో ప్రస్తుత శాసనసభ గడు వు ముగియనున్నది. ఆ గడువు కు అటు ఇటుగా ఎన్నికలు జరిగే అవకాశముందన్న అభిప్రాయా లూ వినిపిస్తున్నాయి.
దీంతో కచ్చితంగా ఎన్నికలు జరిగే క్రమంలో కొ త్తగా ఓటర్ల చేరికను పార్టీలు, 17 ఏం డ్లు దాటుతున్న యువత ప్రతిష్టాత్మకం గా భావిస్తున్నారు. అధికారులు సైతం ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవాలని కోరుతున్నారు. ముసాయిదా జాబితాలో తమ పేర్లు చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఏమైనా మార్పులు, చే ర్పుల కోసం డిసెంబర్ 8 వరకు గడువు క ల్పించారు. దీనిని పరిశీలించిన తర్వాత జనవరి 5న తుది ఓటర్ల జాబితా విడుదల చే యనున్నారు. దీంతో ఎన్నికల్లో ఓటు నమోదుకు ముసాయిదా జాబితా ను పరిశీలించుకోవాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.
ఎన్నికల సంఘం ఏడాదిలో నాలుగు సా ర్లు ఓటర్ల నమోదుకు చర్యలు తీసుకుంటున్నది. అక్టోబర్ 1న కొత్తగా ఓటర్ల న మోదు, మార్పులు, చేర్పులకు ఎన్నికల అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. దీని ప్రకారం నాగర్‌కర్నూల్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6.44 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్ల ముసాయిదా జాబితాను పోలింగ్ బూతుల్లో అందుబాటులో ఉంచాం. ఓటర్లు ఈ జాబితాను పరిశీలించి పోలింగ్ స్టేషన్లు, పేర్లు, చిరునామాల మార్పులు ఏమైనా ఉంటే డిసెంబర్ 8 వరకు దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 5న ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తాం.
– ఉదయ్‌కుమార్, కలెక్టర్, నాగర్‌కర్నూల్