నారాయణపేట, నవంబర్ 10 : నారాయణపే ట జిల్లా డీఎంహెచ్‌వో కార్యాలయంపై గురువా రం సాయంత్రం ఏసీబీ అధికారులు దాడులు చే శారు. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ కథనం మేరకు.. దేవరకద్ర మండలం పేరూరుకు చెందిన ఆంజనేయులు నారాయణపేట జిల్లా కోస్గిలో దవాఖాన నిర్వహించేందుకు అనుమతి కోసం ఈ ఏడాది జనవరిలో దరఖాస్తు చేసుకున్నాడు.
నిర్వహణకు అనుమతి రాకపోవడంతో ఎందుకు రాలేదని డీ ఎంహెచ్వో కార్యాలయంలో పనిచేసే మాస్ మీడి యా అధికారి హన్మంతును సంప్రదించాడు. డాక్ట ర్ పేరుతో మరోసారి దరఖాస్తు చేసుకోవాలని తెలియజేయగా.. జూలైలో రెండోసారి దరఖాస్తు చేసుకున్నాడు. అయినా అనుమతి రాకపోవడంతో మ రోసారి హన్మంతును సంప్రదించాడు. అయితే రూ.50 వేలు ఇస్తే అనుమతినిస్తానని హన్మంత్ డి మాండ్ చేశాడు.
దీనికి రూ.25 వేలు చెల్లిస్తానని ఒప్పుకొన్నాడు. తర్వాత ఆంజనేయులు మహబూబ్‌నగర్‌లోని ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి పథకం మేరకు.. రూ.25 వేలను గు రువారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో హన్మంతుకు అందజేశాడు. అనంతరం ఏసీబీ అధికారు లు రంగంలోకి దిగి ఉద్యోగిని పట్టుకున్నారు. లం చం డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెడుతామని ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపారు.