వనపర్తి, నవంబర్ 10 : రాష్ట్రంలో అన్ని వనరులను సద్వినియోగం చేసుకొని సంపద పెంచడంతోపాటు ప్ర జలకూ పంచాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ నుంచి 77 మందికి మంజూరైన రూ.21.09 లక్షల విలువైన చెక్కులను బా ధితులకు మంత్రి పంపిణీ చేశారు. అనంతరం స్థానిక నాయకులు, చెక్కులు అందుకున్న వారితో కలిసి అల్పాహారం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడక ముందు ఆసరా పింఛన్ కింద రూ.200 ఇచ్చే వారన్నారు. స్వరాష్ట్రంలో రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 అందిస్తున్నట్లు తెలిపారు. అనారోగ్యం బా రిన పడి మెరుగైన వైద్య సేవలు అందుకున్న బాధితులకు సీఎం సహాయనిధి సాయం అందిస్తున్నామన్నా రు. పేదింటి ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా రూ.లక్షా 116, రైతుబంధు సాయంగా ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు పంటపెట్టుబడి సాయం అందిస్తున్నట్లు తెలిపారు. అన్నదాత ఏదైనా కారణంతో మృతి చెందితే రైతు బీమా కింద పది రోజుల్లోనే ఆ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు.
ఆడబిడ్డ జన్మిస్తే రూ.13 వేలు, మగబిడ్డ జన్మిస్తే రూ.12 వేలతోపాటు కేసీఆర్ కిట్ అందజేస్తున్న ట్లు పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే తె లంగాణ నెంబర్‌వన్ స్థానంలో నిలిచిందన్నారు. సాగునీటి రాకతో తెలంగాణ పల్లెలు సస్యశ్యామలం అవుతున్నాయని చెప్పారు. 60 ఏండ్లల్లో సాధ్యం కానిది.. ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ చేసి చూయించారన్నారు. అనంతరం మునుగోడు ఎన్నికల్లో కూసుకుంట్లకు అత్యధిక మెజార్టీని అందించడంలో భాగస్వామి అయిన మంత్రి నిరంజన్‌రెడ్డిని స్థానిక నాయకులు శాలువా, పూల బొకేతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ లక్ష్మయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
అక్టోబర్ 29, 30, 31వ తేదీల్లో నిజామాబాద్ జి ల్లా ఆర్మూర్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్ బాలిక ల హాకీ టోర్నమెంట్లో ఉమ్మడి జిల్లా బాలికల జట్టు పాల్గొని 3వ స్థానంలో నిలిచింది. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జట్టును వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వనపర్తి హాకీ క్రీడాకారుల చిరకాల వాంఛ అయిన టర్ఫ్ కోర్టును త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. రాబోయే టోర్నమెంట్లో ప్రథమ స్థానాన్ని సాధించాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా హాకీ సంఘం అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి కుమార్, ఉపాధ్యక్షుడు రామ్మోహన్, సభ్యులు అనిల్‌కుమార్, షబ్బీర్, పద్మ, సుజాత, వహీద్ పాల్గొన్నారు.