జడ్చర్ల, నవంబర్ 10: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జోరుగాసాగుతున్నాయి. గురువారం మొక్కజొన్నకు అత్యధికంగా క్వింటాకు రూ. 2,199ధర పలికింది. అదేవిధంగా ధాన్యం ధరలు కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గురువారం మార్కెట్కు ధా న్యం, మొక్కజొన్న, అమ్మకానికి వచ్చాయి. మార్కెట్కు 2,440 క్వింటాళ్ల మొక్కజొన్న అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ.2,199ధర రాగా కనిష్ఠంగా రూ.1,670 మధ్యస్తంగా రూ. 2,189ధర పలికింది.
అదేవిధంగా 466 క్వింటాళ్ల ఆర్ఎన్ఆర్ రకం ధాన్యం అమ్మకానికి రాగా దానికి క్వింటాకు గరిష్ఠంగా రూ. 1,956ధర రాగా కనిష్ఠంగా రూ.1,339 మధ్యస్తంగా రూ. 1,339ధర పలికింది. అదేవిధంగా మార్కెట్కు 355క్వింటాళ్ల హంసరకం ధాన్యం అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ. 2,038ధర రాగా కనిష్ఠంగా రూ.1,529 మధ్యస్తంగా రూ. 1,668ధర పలికింది. అదేవిధంగా మార్కెట్కు 30క్వింటాళ్ల సోనా ధాన్యం అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ. 1,789ధర వచ్చింది.