పాలమూరు, నవంబర్ 10 : ప్రజాసంక్షేమం, అభివృద్ధి పనులపై అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం చైర్పర్సన్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ అన్నిశాఖల అధికారులు సమన్వయం పాటించకపోతే ఆశించిన ఫలితం ఉండదన్నారు. అభివృద్ధి పనులు, పథకాల అమలులో జాప్యం జరగకుండా అందరూ సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.
వానకాలంలో పండించిన ధాన్యం సేకరణకు జిల్లావ్యాప్తంగా 191 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ ప్రగతిని డీఏవో వెంకటేశ్ వివరించారు. ధాన్యం విక్రయించిన రైతులకు మూడు, నాలుగురోజుల్లో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమయ్యేలా చర్య లు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతుబంధు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం భూత్పూర్ ఎంపీపీ శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని కొనుగో లు కేంద్రాల్లో హమాలీ కమీషన్ ఓకేలా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
జెడ్పీ వైస్‌చైర్మన్ కోడ్గల్ యాదయ్య మాట్లాడుతూ రైతుబీమా అమలులో జాప్యం జరుగుతుందని, బాధిత కుటుంబాలకు తక్షణమే రైతుబీమా అందేలా చూడాలని అధికారులకు సూచించారు. మహబూబ్‌నగర్ మండలానికి హార్టికల్చర్ అధికారిని నియమించాలని ఎంపీపీ సుధా శ్రీ కోరారు. కొనుగోలు కేంద్రాలకు టార్పాలిన్లు సరఫరా చేయాలని, పం టమార్పిడిపై రైతులకు అవగాహన క ల్పించాలని సీసీకుంట జెడ్పీటీసీ రాజేశ్వరి అధికారులకు సూచించారు.
ప్ర జాప్రతినిధులు ఆయిల్‌పాం సాగు చే పట్టి రైతులకు ఆదర్శంగా నిలవాలని కోరారు. అదేవిధంగా గండీడ్ జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, కోయిలకొండ జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి, బాలనగర్ జెడ్పీటీసీ కల్యాణి గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను సభ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీ సీఈవో జ్యోతి తదితరులు ఉన్నారు.
మహబూబ్‌నగర్‌టౌన్, నవంబర్ 10 : మున్సిపాలిటీలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను గురువారం సీడీఎం అధికారి మల్లికార్జున్ పరిశీలించారు. స్లాటర్‌హౌస్, నర్సరీలను సందర్శించి పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఆయన వెంట ఏఈ హరికృష్ణ ఉన్నారు.