Iran President | ఆందోళనలను హింసాత్మకంగా అణిచేసిన ఇరాన్.. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పిన అధ్యక్షుడు పెజెష్కియాన్
Iran President | ఇరాన్ (Iran) లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలపై అక్కడి భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపి హింసాత్మకంగా అణచివేసినందుకు ఆ దేశ అధ్యక్షుడు (Iran President) మసౌద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian) ఒకింత బాధను వెలిబుచ్చారు.
Iran President : ఇరాన్ (Iran) లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలపై అక్కడి భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపి హింసాత్మకంగా అణచివేసినందుకు ఆ దేశ అధ్యక్షుడు (Iran President) మసౌద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian) ఒకింత బాధను వెలిబుచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అణచివేతలో కుటుంబసభ్యులను కోల్పోయిన వారు, గాయపడిన వారు అనుభవించిన బాధ తనకు తెలుసని అన్నారు.
దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని కట్టడి చేయలేకపోయినందుకు ప్రభుత్వం సిగ్గుపడుతోందని పెజెష్కియాన్ తెలిపారు. అయితే భద్రతాబలగాలు చేసిన దాడుల్లో అక్కడి నిరసనకారులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన పేర్కొనలేదు. పాశ్చాత్య దేశాలు చేసిన తప్పుడు ప్రచారాలవల్ల దేశంలో నిరసనలు చెలరేగుతున్నాయని తెలిపారు. తమ ప్రభుత్వం ఎప్పటికీ ప్రజలతో ఘర్షణలు, ఇతర దేశాలతో యుద్ధాలు కోరుకోదని అన్నారు.
తాము పెద్ద మొత్తంలో అణ్వాయుధాలు తయారు చేస్తున్నామని ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని మసౌద్ పెజెష్కియాన్ స్పష్టంచేశారు. శాంతియుత ప్రయోజనాల కోసం అణుశక్తిని ఉపయోగించుకునే చట్టబద్ధమైన హక్కులను మాత్రమే తాము కాపాడుకుంటామని తెలిపారు. చర్చలతో అన్ని సమస్యలను పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మరోవైపు అమెరికా చేస్తున్న డిమాండ్లకు ఇరాన్ ఎట్టిపరిస్థితుల్లోనూ లొంగదని స్పష్టంచేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

