– వాయిల సింగారం గ్రామ సర్పంచ్ నందిగామ శ్రీనివాసులు
అనంతగిరి, ఫిబ్రవరి 11: అనంతగిరి మండలంలోని వాయిల సింగారం 1వ అంగన్వాడీ సెంటర్ను గ్రామ సర్పంచ్ నందిగామ శ్రీనివాసులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో రికార్డులు పరిశీలించారు. అనంతరం విద్యార్థుల ఆహారాన్ని తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్వాడీ సెంటర్కు ప్రహరీ లేకపోవడంతో విష సర్పాలు, వీధి కుక్కలు అంగన్వాడీ కేంద్ర ప్రాంగణంలోకి వస్తున్నాయని, మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అంగన్వాడీ టీచర్ సుజాత, పిల్లల తల్లిదండ్రులు సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన సర్పంచ్ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. సర్పంచ్ వెంట గ్రామ పెద్దలు కొల్లు సుబ్బారావు, రాంబాబు ఉన్నారు.