మద్దూర్, నవంబర్ 10 : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యే యమని, రైతులు ధాన్యం విక్రయించేందుకు ఎలాంటి ఇ బ్బందులు పడొద్దని ప్రభుత్వం గ్రామ గ్రామానా కొనుగో లు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని కొడంగల్ ఎమ్మెల్యే ప ట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని కొత్తపల్లి, దోరెపల్లి, మద్దూర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చే సిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పం డించిన పంటను దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు.
ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు పదిహేను రోజుల్లోగా రైతుల ఖాతాల్లో జమచేస్తుందని తెలిపా రు. ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందని భరోసా కల్పించారు. అనంతరం ఎమ్మార్వో కార్యాలయంలో కల్యాణల క్ష్మి, షాదీముబారక్ చెక్కులను 93 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అలాగే పట్టణ కేంద్రంలోని రోడ్డు డివైండింగ్ పనులను రూ.5కోట్లతో త్వరలో ప్రారంభిస్తానని హా మీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మ న్ రామకృష్ణ, పీఏసీసీఎస్ చైర్మన్ జగదీశ్వర్, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు వీరారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సి.వెంకటయ్య, నాయకులు సలీం, మధుసూదన్‌రెడ్డి, ఐకేపీ అధికారు లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామస్తలు తదితరులు ఉన్నారు.
గుండుమాల్, నవంబర్ 10 : పండిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని గుండుమాల్, బోగారం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎ మ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాల వద్దకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూ చించారు. వ్యవసాయాన్ని ప్రథమ స్థానంలో ఉంచాలని ఆ లోచన చేసిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని తెలియజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ప్రకాశ్‌రెడ్డి, ఎంపీపీ మ ధుకర్రావు, సింగిల్‌విండో చైర్మన్ నర్సింహులు, రైతుబం ధు సమితి మండలాధ్యక్షుడు వెంకటేశ్, సర్పంచ్ విజయలక్ష్మి, ఏఈవో చందన, నాయకులు పాల్గొన్నారు.