నారాయణపేట, నవంబర్ 10 : విద్యార్థులు చదువుతోపాటు ఇష్టమైన కళలను నేర్చుకోవాలని డీఈ వో కార్యాలయ సూపరింటెండెంట్ నర్సింహులు అన్నారు. ఈనెల 14 న బాలల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని బాలకేంద్రంలో వి ద్యార్థులకు బృంద పాటల పోటీల ను నిర్వహించారు. ముందుగా స రస్వతీమాత చిత్రపటానికి పూలమాల వేసి పూ జలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ బాలకేంద్రాలు సాంప్రదాయ కళలకు జీవం పోస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు తమకు ఇ ష్టమైన కళలను నేర్చుకునేందుకు ప్రభుత్వం బాలకేంద్రాలను ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు. అనంతరం నిర్వహించిన దేశభక్తి బృంద గీతాల పోటీల్లో జూనియర్స్, సీనియర్స్ విభాగాలలో 18 బృందాలు పాల్గొని తెలుగు, హిందీ భాషల్లో గీతాలను ఆలపించారు.
జూనియర్స్ విభాగంలో దయానంద విద్యా మందిర్‌కు చెందిన నవనీత బృందం మొదటి బ హుమతి, హంసవాహిని ఉన్నత పాఠశాలకు చెం దిన అనిత బృందం ద్వితీయ బహుమతి, కోటకొండ బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలకు చెందిన అనిత బృందం తృతీయ బహుమతి సాధించారు. సీనియర్స్ విభాగంలో సరస్వతీ శిశు మందిర్‌కు చెందిన మహేశ్వరి బృందం మొదటి బహుమతి, శ్రీసాయి ఉన్నత పాఠశాలకు చెందిన అభిషేక్ బృం దం ద్వితీయ బహుమతి, హంస వాహిని ఉన్నత పాఠశాలకు చెందిన మీనాక్షి బృందం తృతీయ బ హుమతి సాధించారు. కార్యక్రమంలో బాలకేం ద్రం సూపరింటెండెంట్ మహిపాల్‌రెడ్డి, నర్సింహులు, వసంత్, జ్ఞానామృత, శ్రావణి, సువర్ణ, వి ద్యార్థులు పాల్గొన్నారు.