నారాయణపేట టౌన్, నవంబర్ 10 : రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు పది రోజుల్లో అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో వ్యవసా య, ఉద్యానశాఖ అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతుబీమా విషయంలో మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్, కుటుంబ సభ్యుల సర్టిఫికెట్ తదితర వాటితో దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లో జా రీ చేయాలని జిల్లాలోని తాసిల్దార్లను ఆదేశించినట్లు చె ప్పా రు. రైతుబీమా దరఖాస్తు చేసుకునే విధానం తెలియని లబ్ధిదారులకు ఏఈవోలు దగ్గరుండి దరఖాస్తు చేయించాలన్నా రు.
పారామీటర్ పరంగా జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానం లో నిలిపేలా కృషి చేయాలన్నారు. పీఎం కిసాన్, రైతుబం ధు విషయంలో రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. ఫర్టిలైజర్, సీడ్ క్వాలిటీ కంట్రోల్ విషయంలో అన్ని షాపులను సంప్రదించి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించ డంతో నాణ్యత నిర్ధారణ చేసుకోవాలన్నా రు. ఆయిల్‌పామ్ తోటల పెంపకంపై రైతులను ప్రోత్సహించి జిల్లాకు ఇచ్చిన లక్ష్యం పూర్తి చేయాలన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి జాన్‌సుధాకర్, ఏవోలు తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించి ఆరోగ్యవంతులుగా తయారు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆ దేశించారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో స్త్రీ శిశుసంక్షేమశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడా రు. జిల్లాలో స్యామ్ మ్యామ్ పిల్లల సంఖ్యను తగ్గించేందు కు ఇప్పటికే మిల్లెట్‌తో తయారు చేసిన చెక్కీలను ఇవ్వడం జరుగుతుందని, దీనికి విస్తరించి ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు.
చిక్కీలను తయారు చేసే బాధ్యత ఆరుణ్య మహిళా సంఘాలకు అప్పగించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి స్యామ్ మ్యామ్ పిల్లల బరువులు తీయాలన్నారు. మహిళా సంఘాలకు స్వయం ఉపాధి విషయంలో తగిన ప్రోత్సాహం క ల్పించాలన్నారు. సమావేశంలో స్త్రీ శిశుసంక్షేమ అధికారి వే ణుగోపాల్, డీపీఎం రామునాయక్, సీడీపీవోలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.