దేవరకద్ర, నవంబర్ 10 : అన్నదాత సంక్షేమానికి ప్ర భుత్వం పెద్దపీట వేసిందని ఎంపీపీ రమాశ్రీకాంత్యాదవ్, జెడ్పీటీసీ అన్నపూర్ణ అన్నారు. మండలంలోని బస్వాపూర్, నాగారం, గూరకొండ, దేవరకద్ర, డోకూర్, జీన్గురాల గ్రామాల్లో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాల ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు లు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని కోరారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొండారెడ్డి, ఏవో రాజేందర్ అగర్వాల్, వైస్‌ఎంపీపీ తుమ్మల సుజాత తదితరులు పాల్గొన్నారు.
మూసాపేట, నవంబర్ 10 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఎంపీపీ గూపని కళావతీకొండయ్య కోరారు. మండలంలోని నిజాలాపూర్, మూసాపేట తదితర గ్రామాల్లో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంబించారు. కార్యక్రమంలో పోల్కంపల్లి సింగిల్‌విండో చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు భాస్కర్‌గౌడ్, గడ్డమీది భీమన్న, గుడిసె అంజనేయులు, కొండయ్య, తిరుపతయ్య, శ్రీనివాసులు, నారాయణ, బాలరాజు, రత్నయ్య, ఎం.భీమన్న, లక్ష్మయ్య, కృష్ణయ్య పాల్గొన్నారు.
అడ్డాకుల మండలంలోని చిన్నమునగనల్చేడ్, బలీదుపల్లి, వర్నె తదితర గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఏవో శ్రీనివాసులు, డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాసులు, ఏపీఎం సుదీర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.