కొల్లాపూర్, నవంబర్ 8 : అటవీ శాఖ అధికారు లు వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. నిబంధనల ప్రకారం నల్లమల అటవీ ప్రాంతం నుంచి రాళ్లు, ఇసుక, మట్టి, వంట చెరుకు వంటి ఏ వస్తువులనూ తరలించొద్దు. కానీ, కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ అధికారులు సోమశిల బీట్‌లోని ఎర్రకుంట వద్ద ఉన్న నా ణ్యమైన ఎర్రమట్టిని ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. మం డలంలోని మాచినేనిపల్లి శివారులో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆగ్రహారం నర్సరీకి మట్టిని యథేచ్ఛగా తీసుకెళ్తున్నారు. దట్టమైన కొండల మధ్య ఎకో టూరిజం వారు ఏర్పాటు చేసిన రహదారి మీదుగా ట్రాక్టర్లను నడుపుతున్నారు. అయితే, అటవీ ప్రాంతం నుంచి మట్టిని సరిహద్దు దాటి తరలించొ ద్దు.
కానీ అటవీ ప్రాంతం నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరం ఉన్న అగ్రహారం నర్సరీకి మట్టిని తరలించడమేంటని పర్యావరణ వేత్తలు ప్రశ్నిస్తున్నారు. పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామానికి చెంది న ఆరు ట్రాక్టర్లలో ఎర్రమట్టిని తీసుకెళ్తున్నారు. ఇంకో విషయమేమిటంటే అటవీ ప్రాంతంలో ఎలాంటి ని ప్పు పెట్టరాదు. కానీ, ఎర్రకుంట వద్ద దట్టంగా ఉన్న ముళ్లపొదలను ఫారెస్ట్ సెక్షానాఫీసర్, ప్రొటెక్షన్ వాచర్ పర్యవేక్షణలో జేసీబీతో తొలగిస్తున్నారు. ఎర్రకుంట చెరువుగట్టుపై ఉన్న ఎండుకర్రల కుప్పకు నిప్పంటించారు. మట్టిని తరలించేందుకు ఒక్కో ట్రాక్టర్‌కు రూ.5 వేల చొప్పున కిరాయి చెల్లిస్తున్నట్లు ట్రాక్టర్ యజమానులు తెలిపారు. ఈ విషయాలను బట్టి చూస్తే ప్రభుత్వ నిబంధనలను ఎవ్వరూ పాటించడం లేదనేది అర్థమవుతున్నది. స్థానిక అటవీశాఖ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తున్నది.
ఎర్రకుంట చెరువును సురభిరాజుల కాలంలో వన్యప్రాణుల దాహం తీర్చేందుకు నిర్మించారు. అది శిథిలావస్థకు చేరుకోవడంతో వేసవిలో చెరువు పూడిక తీశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఎర్రకుంటలో నీళ్లు చేరాయి. అయితే, కొన్ని రోజుల కిందట జిల్లా అటవీశాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని విజిట్ చేసి.. వన్యప్రాణుల దాహం తీర్చేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులకు సూచించారు. అయితే, ఎర్రకుంటలో బోర్ వేసి సోలార్ పవర్‌తో నీటిని నింపేందుకుగానూ ఫారెస్ట్ సెక్షానాఫీసర్ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. వాల్టా చట్టానికి తూట్లు పొడిచి ఎర్ర మట్టిని తరలించడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
దీనిపై ఇన్చార్జి ఎఫ్ఆర్వో పద్మారావును వివరణ కోరగా.. రేంజ్ పరిధిలో ఏం జరిగినా.. అంతా ఎఫ్డీవోనే సమాధానం చెబుతారన్నారు. ఎఫ్‌డీవో నవీన్‌రెడ్డిని వివరణ కోరగా.. మా పరిధిలో ఉన్న అడవి నుంచే నర్సరీకి మట్టిని త రలిస్తున్నాం అని చెప్పారు. వాల్టా చట్టం మేర కు అటవీ ప్రాంతం నుంచి మట్టి తరలిం చొద్దు కదా అని ప్రశ్నించగా.. నీళ్లు నమి లారు. అక్కడికి వచ్చినప్పుడు రేంజ్ తో తెలుసుకొని పూర్తి వివరా లు చెబుతానన్నారు.