ఆత్మకూరు, నవంబర్ 3 : విద్యుదుత్పత్తి ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ జెన్కో అధిగమించింది. గత నెల 19న ఎగువ జూరాల విద్యుత్ ప్రాజెక్టులో ఆల్‌టైమ్ రికార్డు బద్ధలు కాగా.. గురువారం దిగు వ జూరాల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఈ రికార్డుకు బ్రేక్ పడింది. ప్రాజెక్టులు నెలకొల్పిన నాటి నుంచి ఏడాదికేడాది ఉత్ప త్తి పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాది లక్ష్యాన్ని అధిగమించడమే గాక గతంలో నమోదైన రికార్డులన్నీ చెరిపివేసింది.
దిగువ జూరాలలో ఈసారి 320 మిలియన్ యూనిట్ల లక్ష్యం ఉండగా.. గత నెల 11వ తేదీనే ఛేదించింది. నాటి నుం చి నిర్విరామంగా ఉత్పత్తి నిర్వహిస్తుండగా గురువారం 400 మిలియన్ యూనిట్ల మైలురాయిని దాటేసింది. వారం రోజులుగా యూనిట్లు తగ్గినప్పటికీ గతంలో నమోదైన అత్యధిక 403 ఎంయూను ఛేదించింది. ఆల్‌టైమ్ రికార్డుకు బ్రేక్ పడడంతో విద్యుత్ అధికారులు సంబురాల్లో మునిగిపోయారు. పవర్‌హౌస్‌లో కేక్ కట్ చేశారు. ఒక్కరోజులో ఎగువ జూరాలలో 2.485 మి. యూ. ఉత్పత్తి జరుగగా.. మొత్తంగా 428.610 మి.యూ. ఉత్పత్తి జరిగింది.
దిగువ జూరాలలో ఒక్కరోజులో 2.819 ఉత్పత్తి జరుగగా.. మొత్తంగా 404 మి.యూ. ఉత్పత్తి చేశారు. ఎగువన 3 యూనిట్లు, దిగువన 3 యూనిట్లలో ఉత్పత్తి జరుతున్నట్లు అధికారులు వెల్లడించారు. నీటి లభ్యత ఉన్నంత వరకు కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ జయరాం (ఎలక్ట్రికల్), ఎస్ఈ శ్రీధర్ (సివిల్), డీఈలు పవన్‌కుమార్, డీఈలు పవన్‌కుమార్, వినోద్, సూరిబాబు, రాజు, ఆనంద్‌కుమార్, సీనియర్ అకౌంట్స్ అధికారి భీమయ్య, ఈఈ వెంకటేశ్వర్లు (సివిల్), ఈడీ రవికుమార్, ఏడీలు రాజేంద్రప్రసాద్, భానుప్రకాశ్, మాధవాచారి, రవిశంకర్, రాజేశ్, మోహన్‌బాబు, పవిత్ర, శివపార్వతి, ఏఈ పాల్గొన్నారు