Do Deewane Seher Mein | వాలెంటైన్స్ కానుక.. మృణాల్ ఠాకూర్ ‘దో దీవానే షెహర్ మే’ ట్రైలర్ రిలీజ్
Do Deewane Seher Mein | బాలీవుడ్ స్టార్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో సిద్ధాంత్ చతుర్వేది, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా ‘దో దీవానే షెహర్ మే’.
Do Deewane Seher Mein | బాలీవుడ్ స్టార్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో సిద్ధాంత్ చతుర్వేది, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా ‘దో దీవానే షెహర్ మే’. ఈ చిత్రం ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. తాజాగా చిత్రయూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూస్తుంటే.. అరేంజ్డ్ మ్యారేజ్ సెటప్‌లో కలిసిన ఇద్దరు వ్యక్తులు (శశాంక్ మరియు రోష్ని) మధ్య చిగురించిన ప్రేమ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. శశాంక్ (సిద్ధాంత్) తన ఉచ్చారణ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే, రోష్ని (మృణాల్) తన అందం విషయంలో బాధపడుతూ ఉంటుంది. ఇద్దరు అసంపూర్ణమైన వ్యక్తులు ఒకరినొకరు ఎలా అర్థం చేసుకున్నారనేదే ఈ సినిమా. నేటి తరం యువత ప్రస్తుతం ఎదుర్కొంటున్న అభద్రతా భావం, ఒత్తిడి, నిజమైన ప్రేమ వెతుకులాటను ప్రతిబింబించేలా ఈ సినిమాను దర్శకుడు రవి ఉద్యవార్ తెరకెక్కించాడు.
తెలుగులో ‘ఖుషి’, ‘హాయ్ నాన్న’ వంటి చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాతోనే బాలీవుడ్‌కు పరిచయం అవుతుండటం విశేషం. భన్సాలీ ప్రొడక్షన్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో ఇలా అరుణ్, జాయ్ సేన్ గుప్తా కీలక పాత్రలు పోషించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

