Jaithra Rama Movies | పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం గురించి సినీ వర్గాల్లో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను 2026 నూతన సంవత్సర కానుకగా జనవరి 1న అధికారికంగా ప్రకటించిన మేకర్స్.. ఇప్పుడు ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం, మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు పూజా కార్యక్రమాలను నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. మార్చి మొదటి వారం నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ షెడ్యూల్‌కు ఇబ్బంది కలగకుండా తక్కువ రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్ ఆప్తమిత్రుడు రామ్ తాళ్లూరి ‘జైత్ర రామ మూవీస్’ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రానికి పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను అందించగా, ఇందులో పవన్ కళ్యాణ్ ఒక మిలిటరీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పనులను ఫిబ్రవరి నాటికి పూర్తి చేసి, వెంటనే సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టనున్నారు. దాదాపు రూ. 75 కోట్ల భారీ రెమ్యూనరేషన్‌తో ఈ సినిమా తెరకెక్కుతోందని, ఇది పవన్ కెరీర్లో 32వ చిత్రంగా రాబోతోందని ఇండస్ట్రీ వర్గాల టాక్.