పాలమూరు, నవంబర్ 1 : మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రచారం నిర్వహించారు. మంగళవారం వర్షం పడుతున్నా లెక్క చేయకుండా పార్టీ నాయకులతో కలిసి మంత్రి ప్రచారంలో పాల్గొన్నారు. పేదల వెన్నంటే సీఎం కేసీఆర్ సర్కార్ ఉంటుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు. కారు గుర్తుకే ఓటేయాలని కోరారు. చౌటుప్పల్ మండలంలోని తాళ్ల సింగారం, లింగోజీగూడెం గ్రామాల నుంచి వలస వెళ్లి జీవనం సాగిస్తున్న దళిత సోదరులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.
మునుగోడులో టీఆర్ఎస్దే విజయం..
జడ్చర్ల/మిడ్జిల్, నవంబర్ 1 : మునుగోడులో జరుగుతున్న ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఘనవిజయం సాధిస్తారని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం నాంపల్లి మండలంలోని రేఖాతండా, దేవత్‌పల్లి గ్రామ పంచాయతీలలో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు.
మంచి చేసే ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని కోరారు. రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నదని తెలిపారు. నిత్యావసర, పెట్రోల్, డీజిల్ ధరలు పెం చి కేంద్రంలోని మోదీ సర్కార్ సామాన్యుల నడ్డి విరిచిందని ధ్వజమెత్తారు. ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ను గె లిపించి బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. కారు గుర్తుకే ఓటే సి గెలిపించాలని కోరారు. ప్రచారంలో బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ చిన్నపల్లి శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచులు ప్రభాకర్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, రవీందర్‌రెడ్డి, రమేశ్‌నాయక్, ముడా డైరెక్టర్లు శ్రీకాంత్, ఇమ్మూ, కౌన్సిలర్ రమేశ్, నాయకులు నవీన్‌రెడ్డి, వీరేశ్, శ్రీనివాసులు, ఎల్లయ్యయాదవ్, సుదర్శన్, చంద్రయ్యగౌడ్, సుకుమార్, వెంకటయ్య, భీంరాజు, బంగారు, జగన్‌గౌడ్, గోపాల్, సురేశ్ పాల్గొన్నారు.