హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఫా ర్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్(ఎఫ్‌పీవో) వ్యవస్థ చాలా వెనుకబడి ఉన్నదని తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ పేర్కొన్నది. రైతుల సమస్యలు, వ్యవసాయ, మార్కెటింగ్ విధానాలపై ఇటీవల కేరళ, మహారాష్ట్ర, ఒడి శా, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో పర్యటించిన కమిషన్.. ఆయా ప్రాంతాల్లో రై తులు ఆర్థికంగా బలోపేతానికి ఎఫ్‌పీవోలు కీలక పాత్ర పోషిస్తున్నట్టు గు ర్తించింది. ఈ మేరకు బుధవారం స చివాలయంలో రైతు కమిషన్ చైర్మన్ ఎ కోదండరెడ్డి సీఎంవో సెక్రటరీ శేషాద్రితో సమావేశమయ్యారు. దేశంలో ని వివిధ రాష్ర్టాల్లో ఎఫ్‌పీవో వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తున్నదని నివేదిక సమర్పించారు. కేంద్ర ప్రభు త్వం కూడా ఎఫ్‌పీవోల ఏర్పాటుకు సానుకూలంగా ఉన్న నేపథ్యంలో తె లంగాణలో కూడా ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చొరవ చూపాలని సూచించారు. కేరళలో అమలవుతున్న మా ర్కెటింగ్ వ్యవస్థ, కౌలు రైతు విధానాలపై రూపొందించిన నివేదికలను కూడా సీఎంవో కార్యదర్శికి అందజేసినట్టు కోదండరెడ్డి వెల్లడించారు.