కాలిఫోర్నియా, ఫిబ్రవరి 11: భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా కంపెనీ చేపట్టే ఏఐ ప్లాన్స్‌ను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని, అలాలేని సిబ్బంది స్వచ్ఛందంగా వెళ్లిపోవచ్చునని గూగుల్ బిజినెస్ విభాగం ప్రకటించింది. ఈ విషయాన్ని కంపెనీ గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ యూనిట్‌లోని కొంతమంది ఉద్యోగులకు పంపిన ఒక అంతర్గత మెమోలో గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ తెలిపారు. కంపెనీ తన భవిష్యత్ ప్రణాళికల్లో పూర్తిగా భాగస్వామ్యం వహించే ఉద్యోగులను మాత్రమే కలిగివుండాలని కోరుకుంటున్నాం.. అని షిండ్లర్ పేర్కొన్నారట. సొల్యూషన్స్ టీమ్స్, సేల్స్, కార్పొరేట్ డెవలప్మెంట్ సహా వివిధ హోదాల్లో ఉన్నవారికి నిష్క్రమణ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 2025లో రికార్డ్ స్థాయిలో 400 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అందుకున్నట్టు గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. ఇప్పుడు హఠాత్తుగా.. ఏఐ పేరుతో ఉద్యోగుల స్వచ్ఛంద విరమణను తెరపైకి తీసుకురావటం టెక్ రంగంలో చర్చనీయాంశమైంది.