దేవరకద్ర రూరల్, నవంబర్ 1: పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు శ్రద్ధగా విని ఉన్నత చదువు లు చదువాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మంగళవారం దేవరకద్ర మండల కేంద్రంలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు సంఖ్య, గ్రేడింగ్ తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం సమయానికి అందుతుందా, రుచికరంగా ఉందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి దవాఖానలో రోగులతో మాట్లాడారు. వైద్యులు అందుబాటులో ఉన్నారా, వైద్యసేవలు సరిగా అందుతున్నాయా అని తెలుసుకున్నా రు. నాలుగు మండలాల ప్రజలు దేవరకద్ర గుండా వెళ్తుంటారని, ఏదైనా ప్రమాదం జరిగితే దవాఖానలో వైద్యులు అందుబాటులో ఉండాలని సూచించారు. అదేవిధంగా పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. చిన్నారులకు ప్రభుత్వం నుంచి వచ్చే పౌష్టికాహారం సరైన సమయంలో అందించాలన్నారు. అనంతరం డోకూర్‌లోని పాఠశాలను తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును పరిశీలించారు. విద్యార్థులతో పాఠాలు చదివించి, రాయించారు. విద్యలో నాణ్యతను పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం హెచ్ఎం, ఉపాధ్యాయులు విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేశారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర మండలంలోని చౌదర్పల్లి, లక్ష్మీపల్లిలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను మంగళవారం ఏఎంవో వెంకట్రాంరెడ్డి, సీఎంవో బాలుయాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పాఠశాలలో నిర్వహిస్తున్న ఎస్ఏ-1 పరీక్షల తీరును పరిశీలించారు. అదేవిధంగా మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు సాధించేందుకు ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎంలు సల్వాచారి, వెంకటేశ్వర్లు, సుధాకర్‌రెడ్డి, ఉపాధ్యాయులు అశ్వినీచంద్రశేఖర్, కల్పన, పుష్ప, భారతి పాల్గొన్నారు.
కందూరు పాఠశాలను సందర్శించిన డీఎఫ్‌వో
మండలంలోని కం దూరు గ్రామాన్ని మంగళవారం మండల ప్రత్యేకాధికారి, డీఎఫ్‌వో సత్యనారాయణ సందర్శించారు. గ్రామంతోపా టు చౌడాయిపల్లిలోని పాఠశాలలు, గ్రామ వీధులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడుతూ మధ్యాహ్న భోజ నం ఎలా ఉందని, పాఠశాలలో సమస్యలు, ఉపాధ్యాయు లు బోధన, విద్యాప్రమాణాలను అడిగి తెలుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీకాంత్, గ్రామపెద్దలు, ఉపా ధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.