నారాయణపేట టౌన్, అక్టోబర్ 31: ప్రజావాణిలో ప్రజలు అందించిన దరఖాస్తులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం పట్టణంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 19 ఫిర్యాదులు వచ్చాయి. దరఖాస్తులను స్వీకరించిన కలెక్టర్ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముం దుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కలెక్టర్ అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో దరఖాస్తు చేస్తే సమస్య త్వరగా పరిష్కారమవుతుందని నమ్మకంతో వివిధ మండలాల నుంచి ప్రజావాణికి వచ్చి వినతులు అందజేస్తారని పేర్కొన్నారు. ఫిర్యాదులను సంబంధిత అధికారి సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిష్కారం చేయలేని అంశాలపై ఫిర్యాదు దారులకు అక్కడే అవగాహన కల్పించాలన్నారు. ఫిర్యాదులను పెండింగ్‌లో పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పద్మజారాణి, ఆర్డీవో రాంచందర్ రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో స్యాండ్ కమిటీ సమావేశం నిర్వహించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమావేశంలో ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ పద్మజారాణి, ఏవో నర్సింగ్‌రావు, తాసిల్దార్లు పాల్గొన్నారు. మండల వ్యవసాయశాఖ అధికారులతో సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ పీఎం కిసాన్ యోజనలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో డీఏవో జాన్‌సుధాకర్, వివిధ మండలాల ఏవోలు పాల్గొన్నారు.