జడ్చర్లటౌన్, అక్టోబర్ 31 : దేశ మాజీ ఉపప్రధాని, స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని సోమవారం ఏక్తాదివస్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకొన్నారు. జడ్చర్లలో వల్లభాయ్ పటేల్ యువజన సం ఘం ఆధ్వర్యంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాద య్య పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా పలు పాఠశాలల వి ద్యార్థులు పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షుడు సతీశ్, పి.మురళి, రామారావు, రాష్ట్రపతి అవార్డుగ్రహీత వేణుగోపాల్, పీఏసీసీఎస్ డైరెక్టర్ జీవన్ గుండప్ప, పరశు రాం, నాగార్జున, రవిశంకర్, గోనెల రాధాకృష్ణ, సుధాకర్, నరేందర్, రాజేశ్, శ్యాం సుందర్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్అర్బన్, అక్టోబర్ 31: దేశ సమైక్యత, సమగ్రాభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. జాతీ య ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొ ని కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో సర్దార్ వలభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దేశానికి వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు మరవలేనివని అన్నారు. అనంత రం ఏక్తాదివస్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ, డీఆర్డీవో యాదయ్య, జెడ్పీసీఈవో జ్యోతి ఉన్నారు.
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, అక్టోబర్ 31 : జిల్లా పోలీసు కార్యాలయంలో ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనగా నిర్వహించారు. ఈ సందర్భం గా ఎస్పీ వెంకటేశ్వర్లు ఆయన చిత్రపటాని కి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అ మరవీరుల సంస్మరణలో భాగంగా 21 నుంచి నిర్వహించిన కార్యక్రమాలను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ఎస్పీ కృ తజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాములు, డీఎస్పీలు మహేశ్, ఆదినారాయణ, మధు, సీఐలు రాజు, సురేశ్, శ్రీనివాస్, అప్పలనాయుడు పాల్గొన్నారు.
పాలమూరు, అక్టోబర్ 31 : సర్దార్ వల్లభాయ్‌పటేల్ జయంతిని పురస్కరించుకొ ని పాలమూరు యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ సెల్ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రవీణ, ప్రోగ్రాం అధికారులు ఎస్ఎన్ అర్జున్‌కుమార్, రవికుమార్, శివకుమార్‌సింగ్, చిన్నాదేవి, అధ్యాపకులు రామ్మోహన్, సుదర్శన్‌రెడ్డి, సిద్దరామయ్య, బాలరాజుగౌడ్ పాల్గొన్నారు. అదేవిధంగా మహబూబ్‌నగర్ అర్బన్ తాసిల్దార్ కార్యాలయంలో వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏక్తాదివస్ సందర్భం గా అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో తాసిల్దార్ పార్థసారధి, డిప్యూటీ తాసిల్దార్లు రాజగోపాల్, సునీల్, ఆర్ఐలు నర్సింగ్‌నాయక్, చైతన్య, జూనియర్ అసిస్టెంట్ శరత్, అనిల్, చంద్రకాం త్, మధు, అశోక్ పాల్గొన్నారు.
నవాబ్‌పేట, అక్టోబర్ 31 : స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఏక్తాదివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి పటేల్ చేసిన సేవలను కొనియాడారు. అనంతరం ఏక్తాదివస్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, తాసిల్దార్ రాజేందర్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీలత, సూపరింటెండెం ట్ శ్రీనివాస్, ఏపీవో జ్యోతి పాల్గొన్నారు.
బాలానగర్, అక్టోబర్ 31 : మండలకేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో ఏక్తాదివస్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కళాశాల అ ధ్యాపకులు పాల్గొన్నారు.
భూత్పూర్, అక్టోబర్ 31 : స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని మండల పరిషత్ కార్యాలయంలో ఏక్తాదివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సం దర్భంగా ఎంపీడీవో మున్ని మాట్లాడుతూ దేశంలో ఐక్యతాభావాన్ని చాటాల్సిన బా ధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం పంచాయతీరాజ్ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీవో విజయకుమార్, పీఆర్ ఏఈ అభిషేక్, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బం ది పాల్గొన్నారు.
గండీడ్, అక్టోబర్ 31 : భారత మొదటి ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జ యంతిని మండల పరిషత్ కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచుల సం ఘం మండల అధ్యక్షుడు గోపాల్, ఎంపీటీసీ బాలయ్య, ఎంఈవో వెంకటయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భిక్షపతి, ఏపీవో హరిశ్చంద్రుడు పాల్గొన్నారు.
హన్వాడ, అక్టోబర్ 31 : మండల పరిషత్, తాసిల్దార్ కార్యాలయాల్లో సర్దార్ వ ల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో ధనుంజయగౌడ్, ఈవోపీఆర్డీ వెంకట్‌రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ సతీశ్‌కుమార్, ఎంఈవో రాజూనాయక్ తదితరులు పాల్గొన్నారు.
మహ్మదాబాద్, అక్టోబర్ 31 : దేశ సమైక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చిరస్మరణీయమని తాసిల్దార్ ఆంజనేయులు అన్నారు. తాసిల్దార్ కార్యాలయం లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ని వాళులర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ శేఖర్, ఆర్ఐ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.