
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ/వనపర్తి, డి సెంబర్ 14 : రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతున్నది. పగటిపూట సాధారణ ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో రాత్రి అత్యంత కనిష్ఠ ఉ ష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే, చలి నుంచి రక్షణ పొందేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎ లాంటి పండ్లు తినాలి, ఏ సమయంలో ఏ ఆ హారం తీసుకోవాలి అనే అంశాలను వివరిస్తున్నారు. అలాగే, చర్మరక్షణ కోసం సన్ స్క్రీన్ లోషన్లతోపాటు ఇంట్లోనే పాటించగలిగే చిన్న చిన్న చిట్కాలను చెబుతున్నారు. ప్రధానంగా చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సీజనల్ వ్యాధు లు ప్రజలుతున్న నేపథ్యంలో ఎవరూ భ యాందోళనకు గురికాకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని అంటున్నారు.
చలి పెరిగినప్పుడు గాలిలో వైరస్ వ్యాప్తి అ ధికంగా ఉంటుందని, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారు త్వరగా వ్యాధుల బారిన ప డే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు జా గ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. డిసెంబర్, జనవరిలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చలికాలంలో వ్యాధులు దరిచేరకుం డా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘నమస్తే తెలంగాణ’ కథనం..
నిర్లక్ష్యం వద్దు..
ఆస్తమా, నిమోనియా, గుండె వ్యాధులతో బాధపడేవారు అప్రమత్తంగా ఉండాలని వై ద్యులు సూచిస్తున్నారు. చల్లటి ప్రదేశంలో తిరిగినా.. చల్లటి ఆహారం తీసుకున్నా.. ఏసీ గదు ల్లో ఉన్నా ఆస్తమా సమస్య పెరుగుతుంది. ని ర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదముంది. వైద్యం ఆలస్యమైతే ఊపిరితిత్తుల్లోకి నీరు చేరుతుంది. దీంతో ఊపిరితిత్తుల పొరలు ఉ బ్బిపోయి శ్వాస కష్టంగా మారుతుందని డా క్టర్లు హెచ్చరిస్తున్నారు.
చలికాలం.. వెచ్చని నేస్తాలు
చలి తీవ్రత పెరుగుతున్నది. సాయంత్రం నుంచే చల్లటి గాలి వీస్తున్నది. ఉదయం 9 అ యితే గానీ చలి తగ్గడం లేదు. ఈ క్రమంలో చలిని తట్టుకునేందుకు ప్రజలు స్వెటర్లు ధరిస్తున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా దుకాణాలు వెలిశాయి. మధ్యప్రదేశ్, రాజస్థా న్ వంటి ప్రాంతాల నుంచి తెచ్చిన స్వెటర్లు, దుప్పట్లు నాణ్యతతోపాటు ధర తక్కువగా ఉండడంతో ప్రజలు కొనుగోలు చేస్తున్నారు.
ఆహారంలో మార్పులు అవసరం..
చలికాలంలో సమతుల ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా జామ, దానిమ్మ, బొప్పాయి, సంత్ర, అరటిపండ్లు ఎంతో మేలు చేస్తాయి. వి టమిన్ సీ ఉన్న పండ్లు జలుబు, ఫ్లూ వంటి అనారోగ్యాల నుంచి కా పాడుతాయి. మరీ పచ్చిగా ఉన్నవి, బాగా పండినవి కాకుండా మధ్యస్తంగా ఉన్నవి ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
చలికాలంలో సహజంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. జలుబు, దగ్గు, వంటివి త్వరగా వస్తాయి. ఆహారం అరుగుదల తక్కువగా ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవాలి.
మనిషి శరీరానికి యాంటీ యాసిడ్స్ ఎంతో అవసరం. గుడ్లు, చేపల్లో ఇవి అధికంగా లభిస్తాయి.
జింక్ ఉండే బాదం వంటి ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి. రోగకారక క్రిములతో పోరాడే పెరుగును తీసుకోవడం ఉత్తమం.
ఎప్పటికప్పుడు వండిన వంటలనే తినాలి. సాధ్యమైనంత వరకు బయట ఆహారానికి దూరంగా ఉండాలి.
మార్కెట్లో లభిస్తున్న నల్లద్రాక్ష చర్మ సంరక్షణకు దోహదం చేస్తున్నది. వీటిలో విటమిన్ ఏ, బీ1, బీ2 ఉంటాయి. పిల్లల్లో కడుపునొప్పికి నివారణిగా పని చేస్తాయి.
చర్మ రక్షణకు..
ప్రతిరోజూ బయటకు వెళ్లే వారు ఎక్కువశాతం శరీరాన్ని కప్పి ఉంచే వస్ర్తాలు ధరించాలి.
అధిక సమయం ఏసీల్లో గడపకపోవడం మంచిది.
ఎండకు వెళ్లాలనుకుంటే సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి.
స్నానానికి సాధారణ సబ్బు స్థానంలో గ్లిజరిన్ ఆధారత సబ్బులను ఉపయోగించాలి. లేదా ఖర్చు తగ్గించుకోవాలనుకునే వారు ఇంట్లోనే అందుబాటులో ఉండే శనగపిండితో స్నానం చేయాలి.
స్నానం చేసే ముందు రెండు చెంచాల నూనెను నీటిలో వేయడం ద్వారా చర్మం మృధుత్వాన్ని కాపాడుకునే అవకాశం ఉంది.
రాత్రివేళల్లో నిద్రించే ముందు మోచేతులు, మోకాళ్లు పగలకుండా నూనెలు, లేపనాలు రాసుకుంటే మంచిది.
థైరాయిడ్ తరహా సమస్యలు ఉన్న వారు పైజాగ్రత్తలతో పాటు ఇంట్లో సాక్స్‌లు ధరించడం మేలు.
జాగ్రత్తలు పాటించండి..
పొగమంచు బారిన పడకుండా మాస్కులు ధరించాలి.
దగ్గు, జలుబు, ఫ్లూ, జ్వరం ఉంటే ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకోవాలి. అవసరమైతే వైద్యుడిని సంప్రదించాలి.
మధుమేహం, గుండెజబ్బులు ఉన్న వారు శరీరంపై గీతలు పడకుండా జాగ్రత్తపడాలి.
శరీరం పొడిబారకుండా, తడిగా ఉండేలా చూసుకోవాలి.
గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. బాగా వేడిగా ఉన్న నీళ్లు వాడకూడదు.
వాహనాలు నడిపే వారు చేతులకు గ్లౌజ్‌లు ధరించాలి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
శీతాకాలంలో జలు బు, చర్మవ్యాధులు, శ్వాసకోశ, నిమోనియా లాంటి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాధారణ జలుబును నిర్ల క్ష్యం చేస్తే ఊపిరితిత్తులకు సంబంధించిన నిమోనియా సమస్యకు దారితీసే ప్రమాదం ఉంది. జలుబు లక్షణాలు కనిపిస్తే సిట్రజిన్, ప్యారాసిట్మల్ను మాత్రమే వాడాలి. యాంటిబయాటిక్ మాత్రలు వేసుకోవడం శ్రేయస్కరం కాదు. చిన్న పిల్లలకు జలుబు చేస్తే ఎక్కువ రోజులు నిర్లక్ష్యం చేయొద్దు. ఆస్తమా ఉన్న వారు చలిలో బయటకు వెళ్లకుండా చూడాలి. చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లటి పదార్థాలు తీసుకోవడం పూర్తిగా మానేయాలి. ఇంట్లో దోమలు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఉదయం వేళ్లలో వాకింగ్‌కు వెళ్లే వారు చర్మాన్ని కప్పి ఉండే దుస్తులతో బయటకు వెళ్లాలి. లోదుస్తులను ఉతక్కుండా ధరిస్తే గజ్జి, తామర లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.