మరికల్, అక్టోబర్ 28 : తెలంగాణలో రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పరుగు పందెంను తలపిస్తున్నది. మూడోరోజు పాదయాత్రలో భాగంగా మండలంలోని ఎలిగం డ్ల నుంచి దేవరకద్ర నియోజకవర్గంలో గోప్లాపూర్ వరకు సాగింది. మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని గ్రామస్తులు ఆశించిన రాహుల్‌గాంధీ విగ్రహం వైపు చూడకుండా వెళ్లిపో యారు. మల్లురవి, జైరాంరమేశ్ విగ్రాహాన్ని ఆవిష్కరించి పూల మాలు వేశారు. రాహుల్‌గాంధీ ఇందిరమ్మను మరిచిపోయారని నాయకులు అసంతృప్తికి గురయ్యారు.
కంపెనీ రద్దు కోసం మద్దతు కోరిన యువకులు
మండలంలోని చిత్తనూర్‌లో నిర్మిస్తున్న జూరాల ఇథనాల్ కంపెనీ ఏర్పాటుతో 32 గ్రామాల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతాయని కంపెనీ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు రాహుల్‌గాంధీకి వినతిపత్రం అందజేస్తూ రద్దుకు మద్దతు ఇవ్వాలని కో రారు. కొంతసేపు యువకులు రాహుల్‌గాంధీతోపాటు ప్ల్లకార్డు లు పట్టుకొని పాదయాత్ర చేపట్టారు. కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి కాంగ్రెస్ నాయకులు, కా ర్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.