నవాబ్‌పేట, అక్టోబర్ 28 : మునుగో డు ఉపఎన్నికలలో కారుదే విజయమని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భా గంగా శుక్రవారం దేవత్‌పల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బ్యాలట్ నమూనాతో టీఆర్ఎస్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వి వరించారు. సీఎం కేసీఆర్ హయాంలో గ్రామాలన్నీ సుందరంగా తీర్చిదిద్దబడ్డాయని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే వృథా అవుతుందన్నారు. గతం లో రాష్ర్ర్టాన్ని పాలించిన ఆ పార్టీలు తె లంగాణను ఆగం చేశాయని గుర్తు చేశా రు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నాగిరెడ్డి, శ్రీను, నవనీతారావు, సంజీవరెడ్డి, ప్రకాశ్, వెంకటేశ్ ఉన్నారు.
మునుగోడు గడ్డ.. ‘గులాబీ’ అడ్డా..
భూత్పూర్, అక్టోబర్ 28 : మునుగో డు ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగర డం ఖాయమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ గడ్డ టీఆర్ఎస్ అడ్డానే అన్నారు. పార్టీ అభ్య ర్థి కూసుకుంట్ల గెలుపు ఖాయమన్నారు. శుక్రవారం మర్రిగూడ మండలం శివన్నగూడెంలో ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి గెలిస్తే కాంట్రాక్ట్ పనులపై నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండాపోతాడన్నారు. కాం గ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఏమీ లాభముండదని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీలు శేఖర్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, నా గార్జునరెడ్డి, జెడ్పీటీసీలు ఇంద్రయ్యసాగర్, రాజశేఖర్‌రెడ్డి తదితరులున్నారు.
కొండాపూర్‌లో..
కోస్గి, అక్టోబర్ 28 : చండూరు మం డలం కొండాపూర్‌లో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ముమ్మర ప్రచారం నిర్వహించారు. పనిచేసే ప్రభుత్వానికి అండ గా నిలబడాలని కోరారు. టీఆర్ఎస్ (బీ ఆర్ఎస్) వెంటే ఉంటామని ప్రజలు హామీ ఇచ్చారన్నారు.
ప్రజలంతా టీఆర్ఎస్ వైపే..
కల్వకుర్తి రూరల్, అక్టోబర్ 28 : ము నుగోడు నియోజకవర్గంలో ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి వైపే ఉన్నారని ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. నాంపల్లి మండలం రేవల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌తో నల్లగొం డ జిల్లాలో ఎన్నో ఏండ్లుగా వేధిస్తున్న ఫోరైడ్ సమస్యకు మిషన్ భగీరథతో శాశ్వత పరిష్కారం చూపారన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వార్థ పూరిత రాజకీయాలు చేస్తూ ప్రజలను ప్రలోభ పెడుతున్నదని విమర్శించారు.