మరికల్/ ధన్వాడ, అక్టోబర్ 28 : ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని టీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అన్నా రు. గిరిజనులకు రిజర్వేషన్ కల్పించిన ఘటన సీఎం కే సీఆర్దే అన్నారు. నారాయణపేట జిల్లాలో బంజారా భవన్ నిర్మాణ పనులకు నిధులు మంజూరైనట్లు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని మిత్ర రైస్ మి ల్ వద్ద ధన్వాడ మండలానికి చెందిన ఓల్యా నాయక్‌తండా, ఓబ్యా నాయక్ తండా, బుడ్డమర్రితండాలకు చెందిన 60 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ ధన్వాడకు డిగ్రీ కళాశాల మంజూరైనట్లు, మారుమూల ప్రాంతంలోని విద్యార్థుల ఉన్నత చదువుకు కష్టాలు తీరనున్నాయని చెప్పారు. పోలీస్‌స్టేషన్, తాసిల్దార్ కార్యాలయ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. టీఆర్ఎస్(బీఆర్ఎస్)ను చూసి బీజేపీ నాయకులకు జ్వరం పట్టుకుందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో రైతుబంధు స మితి కో ఆర్డినేటర్లు సంపత్‌కుమార్, వెంకట్‌రెడ్డి, నాయకులు రాజవర్ధన్‌రెడ్డి, సుధీర్కుమార్రావు, నాగేశ్వర్‌రెడ్డి, బాలరాజు, నర్సింహులు, సునీల్‌రెడ్డి, సచిన్, లక్ష్మీకాంత్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, భగవంత్‌రెడ్డి, హన్మిరెడ్డి, మతీన్, శ్రీనివాసులు, శాంతకుమార్, షాకీర్‌హుస్సేన్, అశోక్, రామన్‌గౌడ్, సతీశ్, గోవర్ధన్‌రెడ్డి, రాయుడు ఉన్నారు.