వనపర్తి, అక్టోబర్ 25 : పేదల బతుకుల్లో వెలుగులు నింపాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని 176 మందికి రూ .1,76,20,416 విలువ గల కల్యాణల క్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అలాగే 141 మంది బాధితుల కు సీఎమ్మార్‌ఎఫ్ నుంచి మంజూరైన రూ.40.26 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని సీఎం కేసీఆర్ జోడెద్దులా నడిపిస్తున్నార ని.., ఇక్కడి పథకాలు దేశంలోని మరే రాష్ట్రంలో అమలుకావడం లేదన్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు, మిషన్ కాకతీయ కింద చెరువులు, కుంటల మరమ్మతులు చే యడంతో సంబురంగా సాగు చేస్తున్నారన్నారు.
ఆరోగ్య రంగంలో కేసీఆర్ కిట్, అమ్మఒడి, నూతన ఆరోగ్య కేం ద్రాలు, బస్తీ దవాఖానలు, ఉచిత ఆరోగ్య పరీక్షా కేం ద్రాలు, కొత్తగా 100 డయాలసిస్ కేంద్రాలు, నూతన మెడికల్ కళాశాలలు, నర్సింగ్, ఫార్మసీ కళాశాలలను ఏ ర్పాటు చేశారన్నారు. ఇలా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ల బ్ధిదారులతో సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమం లో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, టీఆర్ఎస్(బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, ఎంపీపీ కిచ్చారెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.