వ్యవసాయం తర్వాత దేశంలోనే రెండో పెద్ద రంగం
పేదల బతుకుల్లో వెలుగులు నింపడమే లక్ష్యం
జోడెద్దుల్లా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, అక్టోబర్ 25 :చేనేత రంగంపై జీఎస్టీని వెంటనే ఎత్తేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. దేశంలో వ్యవసా య రంగం తర్వాత రెండో పెద్ద రంగం చేనేత అన్నారు. సోమవా రం వనపర్తిలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. చేనేత రంగంపై జీఎస్టీ వేయడంతో కోట్లాది జీవితాల మీద ప్రభావం పడుతుందని తెలిపారు. అందుకే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని కోరారు. నేతన్నల బతుకు మారాలంటే మోదీ సర్కార్ వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. చేనేత సోదరులకు మద్దతుగా అందరూ ప్రధానికి పోస్టుకార్డులను రాసి నేతన్నలకు బాసటగా నిలవాలని మంత్రి సూచించారు.