పాలమూరు, అక్టోబర్ 25 : చేనేతపై విధించిన జీఎస్టీని తక్షణమే రద్దుచేసి చేనేతలకు చేయూ త నిద్దామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పీఎం మోదీకి పోస్ట్ కార్డు రాశారు. చేనేత కార్మికులకు అండగా ఉండాలన్న సోయి మరిచి పన్నులతో బాధ పెట్టడం సరైంది కాదన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు లేఖ రాశారు. చేనేతవస్ర్తాలు, ఉత్పత్తులపై ఐదు శాతం జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా చేనేతపై జీఎస్టీ విధించడం తగదన్నారు. చేనేతల సమస్యలను వివరిస్తూ పీఎంకు పోస్ట్‌కార్డ్ రాసే ఉద్యమాన్ని ప్రారంభించినందుకు మంత్రి కేటీఆర్‌కు సంఘీభావాన్ని ప్రకటించారు. చేనేత రంగాన్ని రక్షించుకునేందుకు ప్రతి సోమవారం కచ్చితంగా చేనేత వస్ర్తాలు ధరిస్తున్నట్లు చెప్పారు.