మక్తల్ టౌన్, అక్టోబర్ 25 : కరాటే ఆత్మైస్థెర్యానికి, మ నోధైర్యానికి ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. డ్రాగన్ షోటోకాన్ కరాటే డూ ఇండియా అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర ఫంక్ష న్ హాల్లో 15వ జాతీయస్థాయి ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మె ల్యే ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను మంగళవారం ప్రారంభించారు. పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గో వా, మహారాష్ర్టల నుంచి కరాటే క్రీడాకారులు పాల్గొని నై పుణ్యతను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ నేటి సమాజంలో ప్రతిఒక్కరూ ఆత్మైస్థెర్యంతో తమను తాము కాపాడుకోవడానికి కరాటే ఉపయోగపడుతుందని తెలిపారు. జాతీయస్థాయి కరాటే చాంపియన్‌షిప్ పోటీలకు మక్తల్ వేదిక కావడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు.
పోటీలను నిర్వహిస్తున్న నిర్వాహకుడు సలాం బిన్ ఉమర్‌ను ఎమ్మెల్యే అభినందించారు. పోటీల్లో నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాలోని క్రీడాకారులు ఓపెన్ చాంపియన్‌షిప్ గెలుచుకోవడం ఆనందించాల్సిన విషయమన్నారు. 14 చాంపియన్ ట్రోఫీల్లో ఆంధ్రప్రదేశ్ 4, కర్ణాటక 2, గో వా 1, తెలంగాణ 7 గ్రాండ్ చాంపియన్స్‌ను సొంతం చేసుకుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) సీనియర్ నాయకుడు కొత్త శ్రీనివాస్ గుప్తా, మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, నాయకులు కోళ్ల వెంకటే శ్, రాజేశ్‌గౌడ్, విష్ణువర్ధన్‌రెడ్డి, కరాటే మాస్టర్లు, రాష్ర్టాల క్రీ డాకారులు తదితరులు పాల్గొన్నారు.