ఊట్కూర్, అక్టోబర్ 25 : విద్యార్థులకు అర్థవంతంగా బోధించి సర్కార్ బడుల్లో విద్యాప్రమాణాలు మెరుగు ప ర్చేందుకు కృషి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఉపాధ్యాయుల ను ఆదేశించారు. మండలంలో కలెక్టర్ మంగళవారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పర్యవేక్షణతో విద్యార్థుల సా మర్థ్యాలను పరీక్షించారు. జిల్లాకేంద్రం నుంచి నేరుగా తి ప్రాస్పల్లి ప్రాథమికోన్నత పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండడంతో ప్రధానోపాధ్యాయుడు గోపాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 3, 4, 5వ తరగతి విద్యార్థులకు అంకూర్ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న గ్రూప్ ఇంగ్లిష్ తరగతులను పర్యవేక్షించి విద్యార్థుల తో రైమ్స్ చదివించారు. ఈక్రమంలో కలెక్టర్ తన చేతి వాచీ ని విద్యార్థులకు చూయించి సమయం ఎంతైందో చెప్పాలని ప్రశ్నించారు.
అనంతరం ఊట్కూర్‌లో తెలుగు, ఉర్దూ మీడి యం ప్రాథమిక, ఉన్నత పాఠశాల, బిజ్వారం, పులిమామి డి, పెద్దజట్రం, నిడుగుర్తి తదితర గ్రామాల్లో ప్రభుత్వ ఉన్న త, ప్రాథమికోన్నత పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయులు, విద్యార్థులకు పలు సూచనలు చేశారు. బిజ్వారం జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి పదో తరగతి విద్యార్థులకు ప్రశ్నలు సంధించారు. విద్యా సంవత్సరం పదికి ప ది పాయింట్లు సాధిస్తామని విద్యార్థులు చేతులెత్తి చెప్పడం తో వారిని అభినందించారు. పది పాయింట్లు సాధించిన వారికి బహుమతులు అందజేస్తామని హామీ ఇచ్చారు. వి ద్యార్థులకు నిర్వహిస్తున్న స్టడీ క్లాసులపై ఆరా తీశారు. మం డలంలోని 5, 8, 5, 12 అంగన్వాడీ సెంటర్లను సందర్శిం చి విద్యార్థులకు అందుతున్న పౌష్టికాహార సేవలను తెలుసుకున్నారు. కేంద్రాల్లో శ్యామ్ మ్యాం పిల్లలు, బరువు త క్కువ పిల్లల వివరాలను అంగన్వాడీ టీచర్లను అడిగి తెలుసుకున్నారు.
పనులు పూర్తి చేయాలి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం నుంచి మం జూరైన నిధులతో పాఠశాలల ప్రహరీ నిర్మాణాలు, సంప్ హౌజ్‌లు, ఎలక్ట్రిసిటీ పనుల ను వేగవంతంగా పూర్తి చేయించాలని స్థా నిక ప్రజాప్రతినిధులు, ఎస్ఎంసీ సభ్యుల ను ఆదేశించారు. ఆయా గ్రామాల్లో సీసీ రో డ్లు, అదనపు తరగతి గదుల నిర్మాణాలపై ఎంపీపీ లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్, సర్పంచు సూర్యప్రకాశ్‌రెడ్డి, పీఏసీసీఎస్ చై ర్మన్ బాల్‌రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకుపోయా రు. కార్యక్రమంలో తాసిల్దార్ తిరుపతయ్య, ఎంపీడీవో కా ళప్ప, ఎంఈవో వెంకటయ్య, సర్పంచులు సుమంగళ, సూ రయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు చదవడం రావాలి
మండలంలోని సంతబజార్ ప్రాథమిక పాఠశాలను మంగళవారం కలెక్టర్ శ్రీహర్ష సందర్శించారు. పాఠశాలల్లో అంకూర్ స్వచ్ఛంద సంస్థ వారు 3, 4వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న గ్రూప్ ఇంగ్లిష్ తరగతులు ఏ విధంగా కొనసాగుతున్నాయో తెలుసుకోవడానికి పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు చదవడం, రాయడం ఏ విధంగా ఉందంటూ కలెక్టర్ ఉపాధ్యాయుల ను అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థితో యాక్షన్ ప్లాన్ల ను తయారు చేయించాలని, అప్పుడే విద్యార్థుల ప్రతిభ తెలుస్తుందన్నారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారి శ్రీనివా స్, పాఠశాల కాంప్లెక్స్ చైర్మన్ రమేశ్, ప్రధానోపాధ్యాయు డు బాలరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.