ధన్వాడ, అక్టోబర్ 25 : చేనేత రంగంపై బీజేపీ ప్రభు త్వం విధించిన జీఎస్టీ 5 నుంచి 12శాతం పెంచడాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు ప్రధానమంత్రికి మంగళవారం రద్దు చేయాలని ఉత్తరాలు రాశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ చేనేత కార్మికులపై జీఎస్టీ పెంచడం వల్ల భవిష్యత్తు అంధకారంగా మారే అవకాశం ఉందని పే ర్కొన్నారు. ప్రతి చేనేత కార్మికుడు జీఎస్టీని రద్దు చేయాలని కోరుతూ ఉత్తరాలను రాయాలని కో రారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పట్టణ అధ్యక్షుడు పటేల్ నర్సింహులు, నాయకులు రాజు, లక్ష్మణ్, జయప్రకాశ్, కార్మికులు పాల్గొన్నారు.
భారం తగ్గించాలి
నేతన్నలపై జీఎస్టీ భారం పడకుండా ఉండాలని కేంద్రాన్ని ఎంపీపీ బక్క నర్సప్ప కోరారు. మండలంలో ప్రధానమంత్రికి జీఎస్టీని ర ద్దు చేయాలని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు మంగళవారం ఉత్తరాలు రాశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మా ట్లాడుతూ జీఎస్టీ 5 నుంచి 12 శాతం పెరిగిందని, దానిని వెంటనే తగ్గించాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకట్రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ శెట్టి శ్రీనివాస్, నాయకు లు, చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.