దేవరకద్ర రూరల్/మూసాపేట(అడ్డాకుల)/భూత్పూర్, అక్టోబర్ 25: ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆదేశాల మేరకు చింతకుంట మండల నాయకులు మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా, శివన్నగూడెంలో మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మరిగూడ మండలం, శివన్నగూడెంలో గ్రామంలో దీపావళి పండుగ పూట కూడా అడ్డాకుల, మూసాపేట మండలాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఎంపీపీలు దోనూరు నాగార్జునరెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీలు నల్లమద్ది రాజశేఖర్‌రెడ్డి, ఇంద్రయ్యసాగర్, జితేందర్‌రెడ్డి, లక్ష్మీనరసింహాయాదవ్, మహమూద్, కొండయ్య, నరేంద్రాచారి, పార్టీ మండల్యాక్షుడు కోట రాము, నాయకులు యాకోబ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఆల ఇంటింటి ప్రచారం
మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డి మర్రిగూడ మండలంలోని శివన్నగూడెంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంగళవారం ఎమ్మెల్యే గ్రామంలోని 12వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటేయాలని ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థి గెలిస్తే నియోజకవర్గం మరింత కుంటుపడుతుందని తెలిపారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.