ఆత్మకూరు, అక్టోబర్ 19 : జలవిద్యుత్ ఉత్పత్తిలో జెన్కో రికార్డులను సృష్టిస్తున్నది. ఎగువ జూరాల విద్యుత్కేంద్రం బుధవారం ఆల్‌టైం రికార్డును అధిగమించింది. 377 మి.యూ ఉత్పత్తితో రికార్డుస్థాయిలో దూసుకుపోతున్నది. 2020-21లో నెలకొల్పిన 370 మి.యూ రికార్డును ఈ ఏడాది అధిగమించడంతో జెన్కో ఉన్నతాధికారులు ఎ గువ జూరాల విద్యుత్ కేంద్రంలో సంబురాలు చేసుకున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. మరో వారంలో దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రం సైతం ఆ ల్టైం రికార్డును బ్రేక్ చేయనున్నట్లు అధికారులు ధీమా వ్యక్తంచేశారు. దిగువ జూరాలలో 405 మి.యూ ఉత్పత్తి రికార్డు ఉండగా.. ఇప్పటివరకు 350 మి.యూ ఉత్పత్తి జరిగింది. ఎగువన వర్షాలు, వరద కొనసాగుతున్న పరిస్థితుల్లో విద్యుదుత్పత్తికి ఎ లాంటి ఆటంకం లేదని, ఈ నేపథ్యంలో రికార్డు బద్దలవ్వడం ఖాయమని చెబుతున్నారు.
దిగువ జూరాల సహితం తన ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్చేస్తే జలవిద్యుత్ ఉత్పత్తిలో జి ల్లా విద్యుత్కేంద్రాలకు ప్రత్యేక స్థానం దక్కనున్నది. ఇదిలా ఉండగా, బుధవారం ఎ గువ జూరాల విద్యుత్ కేంద్రంలో 2.926 మి.యూ ఉత్పత్తి జరుగగా.., ఇప్పటి వరకు మొత్తంగా 377.860 మి.యూ.., దిగువ జూరాలలో 2.782 మి.యూ ఉత్పత్తి జరుగగా.. మొత్తంగా 351.817 మి.యూ ఉత్పత్తి జరిగిందని అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఎస్ఈ జయరాం (ఎలక్ట్రికల్), డీఈలు పవన్‌కుమార్, వినోద్, సూరిబాబు, రాజు, ఆనంద్‌కుమార్, సీనియర్ అకౌంట్స్ అధికారి భీమయ్య, ఈఈ వెంకటేశ్వర్లు (సివిల్), ఈడీ రవికుమార్, ఏడీలు రవి, రూపేష్‌కుమార్, రవి, శరత్‌భూషణ్, వెంకట్‌రెడ్డి, రఘు, శ్రీహరి, శివరాంరెడ్డి, శాంతి, కల్యాణ్రాఘవన్, అరుణశ్రీ ఉన్నారు.