కృష్ణ, అక్టోబర్ 15 : మన ఊరు-మన బడి కార్యక్రమం లో భాగంగా మండలంలోని గుడేబల్లూర్, ముడుమాల, మురహరిదొడ్డితోపాటు పలు గ్రామాల్లో ఎంపిక చేసిన పాఠశాలలను శనివారం కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. విద్యార్థులతో బోధన గురించి తెలుసుకున్నారు. మౌలిక వ సతులపై ప్రధానోపాధ్యాయలతో కలిసి పాఠశాలల్లో కొనసా గుతున్న పనులు పరిశీలించి, నాణ్యత పాటించి త్వరగా పూ ర్తి చేయించుకోవాలన్నారు. అనంతరం పాఠశాలల్లో మధ్యా హ్న భోజనాన్ని పశీలించారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని కష్టపడి చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని కోరా రు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులు పని చే యాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో పారిశుధ్య పనులు నిలిచిపోవద్దని గమనించిన కలెక్టర్ ఎంపీడీవో, ఎంపీవో, గ్రామ కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుడేబల్లూర్ పాఠశాలను సందర్శించిన కలెక్టర్‌ను ఎంపీ పీ పూర్ణిమాపటే ల్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలతో సన్మానించారు. కార్యక్రమం లో ఎంపీటీవో శ్రీనివాసులు, ఎంఈ వో లక్ష్మీనారాయణ, సర్పంచులు, ప్ర జాప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయు లు, వివిధ శాఖల అధికారులు తదిత రులు పాల్గొన్నారు.
పనులు వారంలో పూర్తి చేయాలి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మండలంలోని కొత్తపల్లి, మాగనూర్ గ్రామాల్లో శనివారం కలెక్టర్ సుడిగాలి పర్యటన చేశారు. పాఠశాలలను పరిశీలించారు. కొనసాగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. పనుల్లో వేగం పెంచి తర్వగా పూర్తి చేయాలని ఎస్ఎంసీ స భ్యులు, సర్పంచులకు సూచించారు. చదువు సామర్థ్యంపై విద్యార్థులతో ముచ్చటించారు. ప్రతి శనివారం పాఠశాలలకు నో బ్యా గ్ డే సందర్భంగా కుర్చీ ఆట ఆడుతు న్న విద్యార్థులను చూసి ఆటలపై అక్కడున్న టీచర్లతో ముచ్చటించారు. కార్యక్రమంలో జిల్లా అధికారి శ్రీనివాస్, డీ ఈ రాము, ఎంపీడీవో శ్రీనివాస్, వివి ధ శాఖల అధికారులు, గ్రామ కార్యదర్శులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
గ్రూప్ 1 పరీక్షకు ఏర్పాట్లు చేయాలి
ఆదివారం జరుగబోయే గ్రూప్ 1 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులకు ఆదేశించారు. పట్టణంలోని గ్రూప్ 1 పరీక్ష నిర్వహించే ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రవితేజ, గురుకుల పాఠశాలలను శనివారం సందర్శించారు. ప్రతి పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, బెంచీలు, ఫ్యాన్లు ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అభ్యర్థుల కోసం తాగునీటి వసతి ఏర్పాటు చేయాలని, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. మొత్తం 2,132 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు. ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ సత్యనారాయణ, ఆర్డీవో రాంచందర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయాలి
ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. పట్టణంలోని క లెక్టర్ కార్యాలయంలో పత్తి కొనుగోలుదారులతో శనివారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతులు పత్తికి 8 నుంచి 12 తేమ శాతం ఉండేలా చూడాలన్నారు. నిర్వాహకులు తేమ కొలిచే యంత్రాలు, తూకపు యంత్రాలు సిద్ధం గా ఉంచుకోవాలన్నారు. రైతులు నష్టపోకుండా యాజమా న్యం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు అధికారులు, మిల్లర్స్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసి నాయకులు
ఊట్కూర్, అక్టోబర్ 15 : కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కోయ శ్రీహర్షను మండల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ (టీఆర్ఎస్) నాయకులు శనివారం మ ర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, మాజీ విండో చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ జెడ్పీటీసీ అరవింద్‌కుమార్ తదితరులు కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసి పరిచయం చేసుకున్నారు. మండలంలో నెలకొన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, నాయకులు తరుణ్, షేక్షమి, జాఫర్ పాల్గొన్నారు.