ఊట్కూర్, అక్టోబర్ 15 : మండలంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌ను జిల్లా కోర్టు సివిల్ జడ్జి శ్రీనివాస్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులను పర్యవేక్షించారు. వి ద్యార్థులకు వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు. వి ద్యార్థులు, సిబ్బంది వివరాలను తెలుసుకున్నారు. ప్రభు త్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హాస్టల్ ప్రాంగణంలో బోరు మోటరు చెడిపోయి విద్యార్థులు నీటి కోసం ఇబ్బందులకు గురవుతున్న ట్లు సిబ్బంది సివిల్ జడ్జి దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో ఎస్సై రాములు పాల్గొన్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి
మాగనూర్, అక్టోబర్ 15 : వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కోర్టు సివి ల్ జడ్జి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని బాలికల, బాలు ర ఎస్సీ, షెడ్యూల్ కులాల వసతి గృహాలు, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంసర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన శిక్షణతోపాటు భోజనం అందించే బాధ్యత వా ర్డెన్లదేనని పేర్కొన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులకు దూరంగా ఉండి విద్యను అభ్యసించడానికి వస్తున్నారన్నారు. అందుకు ప్రభు త్వం అందించే అన్ని సుదుపాయాలను వా రికి అందజేయాలన్నారు. భోజనానికి సం బంధించిన రోజువారీ మెనూ సూచిక పా టించాలని సిబ్బందికి సూచించారు.
కస్తూర్బా పాఠశాల పరిశీలన
కృష్ణ, అక్టోబర్ 15 : మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను శనివారం జిల్లా కోర్టు సివిల్ జడ్జి శ్రీనివాస్ పరిశీలించారు. పాఠశాలలో నెలకొన్న పరిస్థితులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంట గది పరిశుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, సామగ్రి గది, తరగతి గదు లు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సలహాలు, సూచన లు చేశారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి శాలిని, ఉపాధ్యాయ బృందం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.