పాలమూరు, అక్టోబర్ 13 : తాను ఫార్మసిస్టు అయినందుకు గర్వపడుతున్నానని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అ న్నారు. మొట్టమొదటగా ఫార్మసీ ఉపాధ్యాయుడిగా ఉండటానికి ఇష్టపడుతానని ఆయనన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఫార్మాసూటికల్ సక్సెస్‌పై నిర్వహించనున్న రెండ్రోజుల జాతీయ స్థాయి సమావేశాలను వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్‌తో కలిసి ఎమ్మెల్యే హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశం అనేక ఔషధాలను ఉత్పత్తి చేసి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నదని తెలిపారు.
డ్రగ్, డెలివరీ, సేఫ్టీ, బయోఅవేలబిలిటీ గురించి విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. భవిష్యత్‌లో ఫార్మసీ తమ జీవితంలో భాగస్వామ్యంగా చేసుకొని ఎదగాలని సూచించారు. అనంతరం వీసీ రాథోడ్ మాట్లాడుతూ ఈ కాన్ఫరెన్స్‌ను ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఐపీఏ ప్రెసిడెంట్ టీవీ నారాయణ్, కన్వీనర్ సుజాత, రిజిస్ట్రార్ గిరిజా మంగతాయారు మాట్లాడారు. కార్యక్రమంలో ఐపీఏ వరంగల్ బ్రాంచ్ సెక్రటరీ డాక్టర్ రాఘవేందర్, కన్వీనర్, ఫార్మా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుజాత, హెచ్‌వోడీ ప్రభాకర్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.