ఖిల్లాఘణపురం, అక్టోబర్ 13 : మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్(బీఆర్ఎస్) బలపర్చిన అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపు కోసం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి మండల నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా రు. పార్టీ అభ్యర్థి విజయానికి తామంతా ప్రచారంలో పాల్గొంటున్నామన్నారు. తెలంగాణలో జరిగిన అభివృ ద్ధి, సంక్షేమ పథకాలు గడపగడపకూ వివరించినట్లు మంత్రి తెలిపారు. ప్రచారంలో ఎంపీపీ కృష్ణానాయక్, ఖిల్లా సర్పంచ్ వెంకటరమణ, నాయకులు ఉన్నారు.
నాగర్‌కర్నూల్, అక్టోబర్ 13 : మునుగోడు ఉప ఎ న్నికల్లో భాగంగా టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపునకు గురువారం ప్రచారం లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి కేటాయించిన మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని 94, 95, 96 బూత్‌లకు సంబంధించి కుమ్మరివాడలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గడపగడప కూ తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఓటర్లను కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ప్రతి ఇంటి నుంచి అపూర్వ స్పందన వ స్తుందని, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుస్తారని ప్రజల నుంచి హామీ వచ్చినట్లు పేర్కొన్నారు. పార్టీ చేపడుతు న్న అభివృద్ధి పనులను చూసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరినట్లు చెప్పారు. వృద్ధులను అప్యాయంగా పలుకరిస్తూ ఓటును అభ్యరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్ యాదవ్, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్‌రెడ్డి, నాయకులు పెద్దపల్లి బంగారయ్య, హన్మంతురావు, ఈశ్వర్‌రెడ్డి, భాస్కర్‌గౌడ్, కేశవులుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కోస్గి, అక్టోబర్ 13 : మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ముమ్మర ప్రచారం చేస్తున్నారు. గురువారం టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి ప్ర భాకర్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ చేపట్టా రు. ఈ ర్యాలీలో కమ్యూనిస్టు పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ర్యాలీలో పాల్గొన్నారు. మునుగోడులో గెలిచే ది గులాబీ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకున్నారని తెలిపా రు. కాంట్రాక్టులకు అమ్ముడుపోయిన నాయకులను త రిమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ నారాయణపేట జిల్లా చైర్మన్ రామకృష్ణ, పీఏసీసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.