ఊట్కూర్, అక్టోబర్ 13 : ప్రజలకు పారదర్శకంగా సేవలందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొట్ట మొదటిసారి గురువారం ఆయన మండల తాసిల్దార్ కా ర్యాలయంతోపాటు ప్రభుత్వ దవాఖానను ఆకస్మికంగా త నిఖీ చేశారు. తొలుత సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని సందర్శించి వ్యవసాయ భూములకు సంబంధించిన స్లాట్ బు కింగ్‌లపై ఆరా తీశారు. కార్యాలయానికి సంబంధించిన ఫైళ్ల ను పెండింగ్‌లో ఉంచకుండా వేగవంతంగా పూర్తి చేయాల ని తాసిల్దార్ తిరుపతయ్యను ఆదేశించారు.
ధరణి సమస్యలను తమ దృష్టికి తేవాలని సూచించారు. కార్యాలయంలో అధికారుల వివరాలను తెలుసుకున్నా రు. అనంతరం ప్రభుత్వ దవాఖానను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై తెలుసుకున్నారు. నెల వారీగా కాన్పుల వివరాలు, రోజువారీ ఓపీ తదితర అంశాలపై డాక్టర్ సాయికుమార్‌ను వివరణ కోరారు. దవాఖా నలో సెక్షన్ల వారీగా ఉన్న సిబ్బంది కొ రతను పీహెచ్సీ వైద్యడు కలెక్టర్ దృష్టి కి తీసుకుపోయారు. కార్యక్రమంలో ధరణి ఆపరేటర్ రాము, ఎంపీహెచ్వో విజయకుమార్ పాల్గొన్నారు.
నారాయణపేట టౌన్, అక్టోబర్ 13 : దవాఖానకు వచ్చే రోగులకు మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. పట్టణంలోని చి న్న పిల్లల ప్రభుత్వ దవాఖానను గురువారం ఆయన తనిఖీ చేశారు. దవాఖా న పరిసరాలు, ఎన్ఐఎస్యూ, పీఐసీయూ వార్డులను పరిశీలించారు.
ప్రతిరోజూ వచ్చే ఓపీ వివరాలు, ఇన్పేషంట్లకు అందుతున్న వైద్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. దవాఖా న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వైద్యం కో సం వచ్చే వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్ రం జిత్కుమార్, డాక్టర్లు మల్లికార్జున్, క్రాంతికుమార్, వైద్య సి బ్బంది తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట, అక్టోబర్ 13 : కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి న కోయ శ్రీహర్షను గురువారం క లెక్టర్ కార్యాలయంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్. రాజేందర్‌రెడ్డి మర్యాదపూర్వకం గా కలిసి పూలమొక్కను అందజేశారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు.