మహబూబ్‌నగర్ టౌన్, అక్టోబర్ 13 : జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాల్లో నెలకొన్న వరద సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు అన్నారు. మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ చాంబర్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో మాట్లాడారు. గతంలో ఎన్న డూ లేనివిధంగా వర్షాలు కురువడంవల్ల లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని తెలిపారు. సమస్య పరిష్కారానికి 40ఏండ్లుగా పనిచేయని పెద్దచెరువు తూమును పునరుద్ధరించినట్లు తెలిపారు. దీంతో ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరదను చెరువులోకి మళ్లించినట్లు పేర్కొన్నా రు. పెద్దచెరువు పరిధిలోని రెండు అలుగులతోపాటు తూము నుంచి వర్షపునీరు దిగువకు వెళ్లడంవల్ల లోతట్టు ప్రాంతాల సమస్య తీరుతుందన్నారు.
విషయాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రూ.100 కోట్లను మంజూరు చే యించినట్లు తెలిపారు. వరద సమస్య పరిష్కారానికి నిధులను మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి పూర్తిస్థాయిలో సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పెద్దచెరువు రెండు అలుగులు, తూము నుంచి వర్షపునీరు దిగువకు వెళ్తుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అనంత రం నీటిపారుదలశాఖ ఎస్ఈ చక్రధర్ మా ట్లాడుతూ పెద్దచెరువు అలుగు ప్రాంతంలో 30 మీటర్లు నాలా ఉందని, అదేస్థాయిలో దిగువభాగాన కూడా నాలా ఉండాలన్నా రు.
పట్టణంలో 25 చదరపు కిలోమీటర్లు కురిసిన వర్షపునీరు దిగువభాగానికి చేరుకుంటుందన్నారు. ఊహించనిస్థాయిలో వర్షం కురవడం, నాలాలు కబ్జాకు గురికావడంతో లోతట్టు ప్రాంతాలకు వరద చేరుతుందని తెలిపారు. పెద్దచెరువులోకి వరద ను వదలడంతో సమస్య పరిష్కారం అవుతుందని కొందరు భావిస్తున్నారని, ఇది కేవ లం అపోహ మాత్రమేనని అన్నారు. అర్బనైజేషన్ పెరిగిందని, పట్టణంలోని మురుగుకాల్వల నుంచి 365 రోజులు వచ్చే నీటితో నిరంతరం అలుగు పారుతూ ఉంటుందని, ఇప్పుడు చెరువులోకి నీటిని మళ్లించడంవల్ల పూర్తిస్థాయిలో సమస్యకు పరిష్కారం ఉండదన్నారు.
చెరువు దిగువన సైతం 10మీటర్లమేర బఫర్ జోన్ ఉంటుందని, ఆ ప్రాం తంలో చేపట్టే నిర్మాణాలకు అనుమతులు ఉండవని స్పష్టం చేశారు. ఆక్రమణలను తొ లగించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ తాటి గణేశ్, కమిషనర్ ప్రదీప్‌కుమార్, కౌన్సిలర్లు ఆనంద్‌కుమార్‌గౌడ్, రష్మిత, మోతీలాల్, ముస్తాక్ రషీద్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ప్రశాంత్ ఉన్నారు.