హన్వాడ, అక్టోబర్ 13 : మండలకేంద్రంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట్రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలకేంద్రంలో రైతుబజార్, ఓపెన్ జిమ్, స్లాటర్హౌస్, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను గురువారం పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చివరిదశలో ఉన్న నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు. రైతుబజార్, ఓపెన్ జిమ్ నిర్మాణ పనులకు సం బంధించిన బిల్లులను రెండు రోజుల్లో ఇవ్వనున్నట్లు తెలిపారు. నిర్మాణ పనుల్లో జా ప్యం జరగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
అలాగే మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. దళితబంధు పథకం లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న షాపుల్లో స్టీల్, సిమెంట్ ఇతర సామగ్రిని కొనుగోలు చేయాలని హౌసింగ్శాఖ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో యాదయ్య, గృహనిర్మాణ శాఖ అధికారి భాస్కర్, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి మధుసూదన్గౌడ్, పంచాయతీరాజ్ ఈఈ నరేందర్, డీఈవో రవీందర్, ఎంపీడీవో ధనుంజయగౌడ్, తాసిల్దార్ శ్రీనివాసులు, ఈవోపీఆర్డీ వెంకట్రెడ్డి, సర్పంచ్ రేవతి, ఎంఈవో రాజూనాయక్, ఉపసర్పంచ్ గంగాపురి, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ కొండా లక్ష్మయ్య, కా ర్యదర్శి వెంకటయ్యగౌడ్, నాయకులు జం బులయ్య, సత్యం, నాగన్న, మన్నాన్, అ నంతరెడ్డి, పెంటయ్య, రాఘవులు, ఆశన్న, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
మహ్మదాబాద్, అక్టోబర్ 13 : భూసమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు. మహ్మదాబాద్ తాసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధర ణి పోర్టల్లో నమోదైన ఫిర్యాదులపై ఆరా తీశారు. మండలంలో 10 రెవెన్యూ గ్రామా లు, 1,483 సర్వేనెంబర్లు ఉండగా, గ్రామాలవారీగా రికార్డులను పరిశీలించారు. ధరణి పోర్టల్లో నమోదైన భూసమస్యల పరిష్కారానికి మండల అధికారులు తీసుకుంటున్న చర్యలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ధరణి రిజిస్ట్రేషన్లపై ఆరా తీశారు. స్లాట్ బుక్ చేసుకున్న రైతులకు సకాలంలో రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశించారు. ధరణి రిజిస్ట్రేషన్లపై ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దని తెలిపారు. కార్యక్రమంలో తాసిల్దార్ ఆంజనేయులు, డిప్యూటీ తాసిల్దార్ శేఖర్, ఆర్ఐ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.