తిమ్మాజిపేట, అక్టోబర్ 7 : టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చి జాతీయ రా జకీయాల్లోకి అడుగు పెడుతున్న సీఎం కేసీఆర్‌కు తిమ్మాజిపేట ఆసరా పింఛన్‌దారులు మద్దతుగా నిలిచారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసిన కేసీఆర్ నాయకత్వం దే శానికి ఎంతో అవసరమని వారన్నారు. శుక్రవారం మండలానికి చెందిన పలువురు వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తమ ఆసరా పింఛన్ సొమ్ము రూ. లక్షగా జమ చేశారు.
ఈమొత్తాన్ని జా తీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఈ విరాళం అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని తిమ్మాజిపేట గ్రామ పంచాయతీ వద్ద ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ మండల అధ్యక్షుడు జోగు ప్రదీప్, సర్పంచ్ వేణుగోపాల్గౌడ్కు అందజేశారు. ఈ సందర్భంగా కొత్త పార్టీకి జైకొట్టారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కవిత, ఉపసర్పంచ్ ఇబ్రహీం, స్వామి, శివ, సైఫొద్దీన్, పింఛన్‌దారులు పాల్గొన్నారు.
తెలకపల్లి, అక్టోబర్ 7 : మండలంలో ని పెద్దూరు గ్రామానికి చెందిన ఆసరా పింఛన్ లబ్ధిదారులు రూ.లక్షా 1,116 విరాళాన్ని అందజేశారు. దేశ రాజకీయా ల్లో సీఎం కేసీఆర్ సఫలీకృతుడు కావాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పా రు. దేశ ప్రజల భవిష్యత్తు కోసం.. అభివృద్ధి కోసం ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేమంతా మద్దతు తెలియజేస్తామని వెల్లడించారు.
తాడూరు, అక్టోబర్ 7 : మండలంలోని ఇంద్రకల్ గ్రామ వృద్ధాప్య పింఛన్‌దారులు, గ్రామస్తులు, నాయకులు టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీకి రూ.లక్షా 1,116 విరాళాన్ని పార్టీ మండలాధ్యక్షు డు రమేశ్‌కు అందజేశారు. అంతకుముందు సచివాలయంలో కేక్ కట్ చేశా రు. కార్యక్రమంలో నాయకులు రాజుగౌడ్, సర్పంచ్ రమణ, విండో చైర్మన్ స మ్మద్పాషా, ఎంపీటీసీ సబిత, ఉప స ర్పంచ్ మల్లమ్మ, నాయకులు తిరుపతిరె డ్డి, అనిల్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, శేఖర్‌గౌడ్, రాజు, కృష్ణ, కృష్ణమోహన్‌రావు, శ్రీశై లం, రాజురెడ్డి, నిరంజన్ పాల్గొన్నారు.