వనపర్తి, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : అభివృద్ధే అభిమతంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపా రు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలను తెలంగాణతో పోల్చలేమని అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ వాహనాలను మంత్రి అందజేశారు. అలాగే మత్స్యకార భవన నిర్మాణ స్థలం, ఎస్సీ, బీసీ డిగ్రీ కళాశాల, వ్యవసాయ కళాశాల భవన స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఎనిమిదేండ్లలో రాష్ట్రంలోని పల్లెల స్వరూపం పూర్తిగా మారిపోయిందన్నారు.
ముఖ్యమం త్రి కేసీఆర్ నాయకత్వంలో గ్రామీణ వృత్తి కార్మికులు బలపడ్డారని అభిప్రాయపడ్డారు. ఉచిత చేప పిల్లలతో మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయని తెలిపారు. సబ్సిడీ గొర్రెపిల్లలతో గొల్ల కురుమలు ఆర్థికాభివృద్ధి సాధించారన్నారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆసరా పథకాలతో మధ్యతరగతి, బలహీన వర్గాలకు భరోసా లభించిందని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా, సాగునీరు, నిరంతర విద్యుత్‌తోపాటు సంక్షేమ పథకాలు వ్యవసాయానికి ఊతమిచ్చాయని తెలిపారు. ఒక్కో రంగాన్ని ప్రణాళికబద్ధంగా తెలంగాణలో అభివృ ద్ధి చేస్తున్నామని వివరించారు.
సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. ఏ రా ష్ట్రం తెలంగాణ దరిదాపుల్లో లేదని పేర్కొన్నారు. కేసీఆ ర్ నాయకత్వంలో పథకాలు దేశానికి దిక్చూచిలా మా రాయని స్పష్టం చేశారు. అనంతరం రాజనగరంలో ఇ ల్లు కూలిపోయిన కుటుంబాన్ని మంత్రి పరామర్శించి డబుల్ బెడ్రూం అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్‌చైర్మన్ శ్రీధర్, ఎంపీపీ కిచ్చారెడ్డి, టీఆర్ఎస్(బీఆర్ఎస్) పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, తాసిల్దార్ రాజేందర్‌గౌడ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహులు, కౌ న్సిలర్ భువనేశ్వరి, నాయకులు పాల్గొన్నారు.