కేంద్ర ప్రభుత్వ అరాచక పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైనదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) కార్యాలయంలో వంద మంది గులాబీ పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీకి దీటైన వ్యక్తి కేసీఆర్ మాత్రమే అని అన్నారు. ఆదర్శంగానిలిచిన తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగిడుతున్నారని తెలిపారు. పాలమూరుకు రూ.వందకోట్ల వరద సాయం మంజూరైనట్లు తెలిపారు.
మహబూబ్‌నగర్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్ర ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తున్నదని, వీరికి చరమగీతం పాడాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్(బీఆర్ఎస్)ను స్థాపించారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ కార్యనిర్వాహక సభ్యుడు మల్లేపల్లి సుధాకర్ ఆధ్వర్యం లో దాదాపు వంద మంది మంత్రి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి మం త్రి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీని ఎదుర్కొనే సత్తా కేసీఆర్‌కు మాత్రమే ఉందన్నారు. తెలంగాణ మాదిరిగా దేశమంతా అభివృ ద్ధి జరగాలనే సంకల్పంతోనే కేసీఆర్ కొత్త పార్టీని స్థాపించారని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్ర భుత్వం కష్టపడి పనిచేస్తుంటే కొన్ని మతతత్వ శక్తులు వర్గాల మధ్య ఘర్షణ సృష్టించి లాభపడాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణ మోడల్ దేశమంతా కావాలంటే అది కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. కేంద్రంలోని సర్కార్ అదాని, అంబానీలకు దోచిపెట్టడమే ధ్యే యంగా పనిచేస్తుందని ఆరోపించారు. ఎలాంటి అభివృ ద్ధి చేయకుండా మతతత్వం పేరుతో రెచ్చగొట్టి అయోమయానికి గురిచేసి ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్నదని ఆరోపించారు. ఇలాంటి మతతత్వ శక్తులపై పో రాటం ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. దేశ ప్రజల బాగుకోసం పనిచేసే వారికి బాసటగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. 70 ఏండ్లకుపైగా అధికారం అనుభవించిన నాయకులు స్థానిక సమస్యలను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తా గునీరు, విద్య, వైద్యంతో సహా అన్ని సమస్యలను తీర్చడంతో ప్రభుత్వంపై ప్రజలకు భరోసా ఏర్పడిందన్నారు. టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీలో కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. పనిచేసే వారికే పదవులు ల భిస్తాయని చెప్పారు. దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేసీఆర్‌కు విజయాలు చేకూరాలని అనంతరం పార్టీ కా ర్యాలయ ఆవరణలో పటాకులు కాల్చారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, ముడా చైర్మన్ వెంకన్న, మున్సిపల్ చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ గణేశ్, ఫ్లోర్ లీడర్ రవికిషన్‌రెడ్డి, కౌన్సిలర్లు రాంలక్ష్మణ్, అంజాద్, ప్రశాంత్, నాయకులు శివరాజ్, సత్యం యాదవ్, రామకృష్ణ, జావేద్ పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరును వరదలు అతలాకుతలం చేయగా.., రాష్ట్ర ప్ర భుత్వం తక్షణ సాయం కింద రూ.100 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం జీవో ఆర్టీ నంబర్ 689 కింద డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ఉత్తర్వు లు జారీ చేసింది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమైన విషయాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సీఎం స్పందించి రూ.100 కోట్లు వి డుదల చేశారు. పట్టణంలో దెబ్బతిన్న రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ మరమ్మతులు, వరద నీ రు నిలవకుండా శాశ్వత చర్యలు తీసుకునేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. నిధులు విడుదల చేసినందుకుగానూ సీఎం కేసీఆర్‌కు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభిస్తామన్నారు. అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.