నారాయణపేట టౌన్, అక్టోబర్ 7 : జిల్లాలో ఈనెల 16న గ్రూప్ 1 పరీక్షల ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ హరిచందన అధికారులను ఆదేశించా రు. శుక్రవారం పరీక్షల నిర్వహణపై ఎస్పీ వెంకటేశ్వర్లు, అధికారులతో వీసీ నుంచి సమావేశం నిర్వహించి మాట్లాడారు. పరీక్షల నిర్వహణ కోసం టీఎస్పీఎస్సీ నుంచి ఏడు పరీక్షా కేంద్రాలను ఏర్పాట్లు చేసినట్లు, మొత్తం 2,184 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, తాగునీ రు, ఫ్యాన్స్, విద్యుత్ దీపాలు తదితర మౌలిక వసతులు కల్పించాలన్నారు. పరీక్ష సందర్భంగా జిరా క్స్ సెంటర్లను మూసి ఉంచాలని, కేంద్రాల ఆవరణలో 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. ప్రతి కేంద్రంలో అభ్యర్థులు మీటరు దూరంలో ఉండే లా చూడాలని, కరోనా పేషంట్ల కోసం ప్రతి కేం ద్రంలో ఒక అదనపు గది ఏర్పాటు చేయాలన్నా రు. ప్రశ్నాపత్రాలు సీసీ టీవీల పర్యవేక్షణలో తెరవాలని, 20శాతం అదనంగా ఇన్విజిలేటర్లు నియమించి వారికి సరైన శిక్షణ, విధి విధానాలు నేర్పించాలని సూచించారు. పరీక్ష రాసే అభ్యర్థులు సమయానికి ముందే కేంద్రాలకు చేరుకోవాలని, పరీక్షా కేంద్రాల్లో ప్రథమ చికిత్స కిట్లు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్షల నిర్వహ ణపై నిర్లక్ష్యం వహించిన అధికారులు చర్యలు తీ సుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పద్మజారాణి, జిల్లా అధికారులు, కేంద్రాల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.